Puzzle picture: 1 కాదు 2 కాదు.. ఈ ఫోటోలో 4 చిరుతలు ఉన్నాయ్.. వాటిని మీరు కనిపెట్టగలరా.. సవాల్

|

Jun 05, 2022 | 5:50 PM

సవాళ్లంటే మీకిష్టమేనా.? మీ ఐ పవర్ ఎంతో తెలుసుకోవాలనుకుంటున్నారా.? అయితే ఈ క్లిష్టమైన ఫోటో పజిల్ మీకోసమే..

Puzzle picture: 1 కాదు 2 కాదు.. ఈ ఫోటోలో 4 చిరుతలు ఉన్నాయ్.. వాటిని మీరు కనిపెట్టగలరా.. సవాల్
Find Leopards
Follow us on

Animal Illusion Picture: ఫోటో పజిల్స్.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. వీటి కంటూ ఫేస్‌బుక్(Facebook), ట్విట్టర్(Twitter), ఇన్‌స్టాలలో స్పెషల్ పేజీలు కూడా ఉన్నాయి. సెల్ఫ్ కాన్పిడెన్స్  ఉన్నవారు.. పజిల్స్‌ను ఎక్కువగా లైక్ చేస్తారు. కనిపించే ప్రతి పజిల్ లెక్క తేల్చేవరకు కుదురుగా ఉండరు. వీకెండ్ బుక్స్, ఫన్ మ్యాగజైన్లలో పద సంపత్తి ఒక ఎత్తయితే.. ఫోటో పజిల్స్ నెక్ట్స్ లెవల్. ఫోటో పజిల్స్(Photo Puzzles) సాల్వ్ చేయాలంటే మీ ఐ పవర్ సాలిడ్‌గా ఉండాలి. ఫన్‌తో పాటు మెదడుకు మేత కూడా కావాల్సిన వాళ్లు ఈ ఫోటో పజిల్స్ వైపు బాగా అట్రాక్ అవుతున్నారు. తాజాగా అలాంటి ఓ ఫోటో పజిల్ ప్రస్తుతం నెట్టింట(Social Media) తెగ వైరల్ కొడుతోంది. అదేంటో చూసేద్దాం పదండి.!. పైన పేర్కొన్న ఫోటోలో ఓ నాలుగు చిరుతలు దాగున్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు కనిపెట్టాలి. చూడటానికి కొండలు, గుబురు పొదలు ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న ఆ ప్రాంతంలోని 4 చిరుతలను కనిపెట్టడం కత్తి మీద సామే. 1, 2 ఎవరైనా కనిపెడతారు కానీ.. మొత్తం 4 కనిపెట్టారంటే మీరు తోపులే. ప్రజంట్ ఈ ఫోటో పజిల్ సాల్వ్ చేసేందుకు నెటిజన్లు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. నూటికి 95 శాతం మంది ఫెయిల్ అయ్యారు. లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి ట్రై చేయండి. మరీ తికమకగా ఉండి ఇక కష్టం బాబోయ్ అనిపిస్తే  ఆన్సర్ కోసం దిగువన ఫోటోను చూడండి.

 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..