Brain Teaser: ఈ రెండు బొమ్మల మధ్య మూడు తేడాలు ఉన్నాయి.. గమనించారా.? ఓసారి ట్రై చేయండి బాస్‌..

Brain Teaser: సోషల్‌ మీడియా అన్నింటిని మార్చేసింది. వినోదం, విజ్ఞానం, సినిమా, వార్త, టైంపాస్‌ ఇలా దేనికైనా కేరాఫ్‌ అడ్రస్‌ ఒకటే అన్నట్లు మారిపోయింది సోషల్‌ మీడియా. చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు ప్రపంచం...

Brain Teaser: ఈ రెండు బొమ్మల మధ్య మూడు తేడాలు ఉన్నాయి.. గమనించారా.? ఓసారి ట్రై చేయండి బాస్‌..
Photo Puzzle

Updated on: Aug 19, 2022 | 11:35 AM

Brain Teaser: సోషల్‌ మీడియా అన్నింటిని మార్చేసింది. వినోదం, విజ్ఞానం, సినిమా, వార్త, టైంపాస్‌ ఇలా దేనికైనా కేరాఫ్‌ అడ్రస్‌ ఒకటే అన్నట్లు మారిపోయింది సోషల్‌ మీడియా. చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు ప్రపంచం ముందుకొచ్చేస్తోంది. ఒకప్పుడు పజిల్స్‌ అంటే వార్త పత్రికలే గుర్తొచ్చేవి. ముఖ్యంగా ఆదివారం వచ్చే సండే మేగజైన్‌ను రోజంతా చదివేవారు. ఆసక్తికర వార్తలతో పాటు మెదడుకు మేత పెట్టే ఎన్నో పజిల్స్‌ ఆ బుక్స్‌లో వచ్చేవి. ఇలాంటి వాటిలో బొమ్మల మధ్య తేడాను గుర్తించడం ఒకటి.

అయితే ప్రస్తుతం దీనిని కూడా సోషల్‌ మీడియానే రీప్లేస్‌ చేసింది. ఈ జనరేషన్ పిల్లలు ఫేస్‌బుక్‌లో ఎక్కువసేపు ఉంటున్నారు. కానీ బుక్స్‌లో ఉండడం లేదు. దీంతో పజిల్స్‌కి కూడా సోషల్‌ మీడియానే వేదికవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది. రెండు బొమ్మల మధ్య ఉన్న తేడాని గుర్తించండి అంటూ ఫొటోను నెటిజన్లను పోస్ట్‌ చేస్తున్నారు.

 పైన రెండు కామిక్‌ ఫొటోలు కనిపిస్తున్నాయి కదూ..! అయితే చూడ్డానికి ఆ రెండు ఫొటోలు ఒకేలా ఉన్నా వాటి మధ్య తేడాలు ఉన్నాయి. జాగ్రత్తగా గమనిస్తే వాటి మధ్య మూడు తేడాలు కనిపిస్తాయి. ఓసారి ట్రై చేయండి… ఏంటి ఎంత వెతికినా కనిపించడం లేదా.? అయితే ఆన్సర్‌ కోసం ఓసారి కింద ఫొటోపై లుక్కేయండి..

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us