Photo Puzzle: దమ్ముంటే కనుక్కోమంటూ సవాల్ విసురుతోన్న ‘తోడేలు’.. 10 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపు!

మెదడుకు కూసింత మేత వేసేందుకు, మీ కళ్ల పవర్ ఏ రేంజో టెస్ట్ చేసేందుకు ఈ మధ్యకాలం ఇంటర్నెట్‌లో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు..

Photo Puzzle: దమ్ముంటే కనుక్కోమంటూ సవాల్ విసురుతోన్న తోడేలు.. 10 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపు!
Photo Puzzle

Updated on: Feb 22, 2023 | 3:36 PM

మెదడుకు కూసింత మేత వేసేందుకు, మీ కళ్ల పవర్ ఏ రేంజో టెస్ట్ చేసేందుకు ఈ మధ్యకాలం ఇంటర్నెట్‌లో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, ఫోటో పజిల్స్ బాగా ప్రాచుర్యం పొందాయి. ముఖ్యంగా ఈ ఫోటో పజిల్స్‌పై నెటిజన్లు తరచూ ఆసక్తిని కనబరుస్తారు. వీటిల్లో దాగున్న సమాధానాలను కనిపెట్టడం అంత తేలిక కాదు. ఎప్పటికప్పుడు మనల్ని కన్‌ఫ్యూజ్ చేస్తుంటాయి. ఇక సోషల్ మీడియాలో ఈ ఫోటో పజిల్స్‌కు కొదవలేదు. వీటికంటూ ప్రత్యేకంగా పేజీస్ సైతం రన్ అవుతున్నాయి. మరి నెట్టింట చక్కర్లు కొడుతోన్న ఓ ఫోటో పజిల్‌పై ఇప్పుడు లుక్కేద్దాం పదండి.. పైన ఫోటోను చూడగానే మొదటగా మీకేం కనిపిస్తోంది.? పచ్చని చెట్లతో నిండిన ప్రాంతంలో గొర్రెల మంద అని అంటారు. అయితే ఆ గొర్రెల మధ్య ఓ క్రూర జంతువు దాగుంది.. అది మీకు కనిపించిందా.? అవునండీ.. గొర్రెల మధ్యలో ఓ తోడేలు నక్కింది. సమయం చూసి దాడి చేయాలని కాపు కాసింది. ఆ గొర్రెల మంద మధ్యలో ఉన్న తోడేలును కనిపెట్టడం కొంచెం కష్టం. కానీ మీరు తీక్షణంగా ఫోటో చూసినట్లయితే.. ఇట్టే కనిపెట్టేస్తారు. మీరూ పజిల్ సాల్వ్ చేయడానికి ఓసారి ప్రయత్నించండి. ఒకవేళ ఎంత వెతికినా సమాధానం దొరక్కపోతే అప్పుడు కింద ఫోటోను చూడండి.

Loading...
Unable to load recommendations.
Follow Us