ఫోటో పజిల్స్, పజిల్ గేమ్స్ అనేవి ఎప్పుడూ కూడా ఆసక్తికరంగానే ఉంటాయి. మనలోని మేధాశక్తిని, ఆలోచనాశక్తిని పెంచేలా చేస్తాయి. ఇటీవల సోషల్ మీడియాలో ఇవి తెగ ట్రెండింగ్ అవుతున్నాయి. ‘ఈ ఫోటోలో దాగున్న జంతువును కనిపెట్టండి’.. ‘ఈ ఫోటోలో దాగున్న సింహాన్ని గుర్తించండి’.. అంటూ మనకే సవాళ్లు విసురుతున్నాయ్. నెటిజన్లు వీటిని బాగా ఎట్రాక్ట్ కావడమే కాకుండా.. అవి ఇచ్చే ఛాలెంజ్‌ను కూడా స్వీకరించి.. అందులో దాగున్న జంతువులను గుర్తించేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. తాజాగా అలాంటి ఓ పజిల్ నెట్టింట వైరల్ అవుతోంది. పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.? చుట్టూ చెట్ల దుంగలు ఉన్నాయి కదూ.! అయితే దుంగల మాటున ఓ పిల్లి కూడా దాగుంది. అది ఎంచక్కా రిలాక్స్ అవుతూ.. మిమ్మల్నే చూస్తోంది. మీకూ ఆ పిల్లి కనిపిస్తోందా.? ఒకవేళ కనిపిస్తే.. మీరు తోపులే.. కానీ ఎంతవెతికినా పిల్లి దొరక్కపోతే.. సమాధానం కోసం కింద ఫోటోను చూడండి.. ఈ ఫోటో పజిల్ నచ్చితే.. మరి లేట్ ఎందుకు మరిన్ని పజిల్స్ కోసం టీవీ9 ట్రెండింగ్ పేజీని చెక్ చేసేయండి.