Viral Video: రోడ్డుపై విచిత్ర యాక్సిడెంట్.. క్షణాల్లో సీన్ రివర్స్.. షాకింగ్ వీడియో!

|

Jul 23, 2021 | 2:24 PM

అదృష్టం మన వెంట ఉంటే దేనినైనా సాధించగలమని పెద్దలు అంటుంటారు. విధిని కూడా మార్చుకోవచ్చునని వారి భావన. సరిగ్గా అలాగే ఇప్పుడొక..

Viral Video: రోడ్డుపై విచిత్ర యాక్సిడెంట్.. క్షణాల్లో సీన్ రివర్స్.. షాకింగ్ వీడియో!
Follow us on

అదృష్టం మన వెంట ఉంటే దేనినైనా సాధించగలమని పెద్దలు అంటుంటారు. విధిని కూడా మార్చుకోవచ్చునని వారి భావన. సరిగ్గా అలాగే ఇప్పుడొక వ్యక్తి గురించి చెప్పబోతున్నాం. అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్‌ లాంటి అతడు యమలోకానికి చేరువగా వెళ్లి వెనక్కి తిరిగొచ్చాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటో చూద్దాం..

ఓ వ్యక్తి రోడ్డు పక్కన హాయిగా నడుస్తున్నట్లు మీరు వీడియోలో చూడవచ్చు. అప్పుడే అకస్మాత్తుగా వెనుక నుంచి వేగంగా ఓ బస్సు అతని వైపుగా దూసుకొస్తుంది. క్షణాల్లో అతడిని ఢీకొట్టింది. అలాగే రోడ్డు పక్కన ఉన్న షాపుల ముందు భాగాన్ని సైతం ధ్వంసం చేస్తుంది. బస్సు చేసిన బీభత్సానికి ఆ వ్యక్తి చనిపోయాడని అందరూ అనుకున్నారు.

కానీ అదృష్టం అతడి వెంట ఉంది. కొద్ది క్షణాలకే పైలేచి వడివడిగా నడుచుకుంటూ పక్కనే ఉన్న షాపులోకి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన విజువల్స్ అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. కాగా, ఈ వీడియోను ట్విట్టర్‌లో ‘@RexChapman’ షేర్ చేయగా.. ఇప్పటిదాకా నాలుగు లక్షల మంది వీక్షించారు. దీనిని చూసిన నెటిజన్లు షాక్‌కు గురి కావడమే కాకుండా కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

Also Read:

పార్లమెంట్‌ సభలో ఊహించని సంఘటన.. నేతలు పరుగో పరుగు.. వైరల్ వీడియో.!

ఆకుకూరలు ఫ్రెష్‌గా ఉండాలా.? ఇలా మాత్రం చేయొద్దు! తస్మాత్ జాగ్రత్త.. వైరల్ వీడియో!

40 ఏళ్ల భారత బౌలర్ దుమ్ములేపాడు.. 10 పరుగులకు 5 వికెట్లు తీసి విధ్వంసం సృష్టించాడు..

ఈ కొండపై చిరుత ఇంచక్కా సేద తీరుతోంది.. అదెక్కడ ఉందో కనిపెట్టండి చూద్దాం.!

మహిళ బయటికి వెళ్లగానే.. ప్లాట్‌లోకి చొరబడుతున్న యజమాని.. చివరికి ఏం జరిగిందంటే!