Watch Viral Video: ఇదేం పైత్యం తల్లీ నీకు…! పెళ్లి మండపంపైనే రెచ్చిపోయిన వధువు.. పొగ తాగుతూ వరుడికి లిప్‌కిస్..

చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ జంట చేసిన పనికి చిర్రెత్తిపోతున్నారు.. హుక్కా తాగడం మంచిది కాదని, అది కూడా కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల సమక్షంలోనే ఇలా చేస్తున్నారంటే.. అంటూ ఘాటుగా విమర్శించారు. నెటిజన్లు సోషల్ మీడియాలో పబ్లిసిటీ కోసం ఇలా చేశారని, మరికొందరు క్యూట్‌గా ఉంటుందని భావించి ఉంటారంటూ కామెంట్ చేశారు. ఏది ఏమైనప్పటికీ వీడియో మాత్రం నెట్టింట దుమారం రేపుతోంది.

Watch Viral Video: ఇదేం పైత్యం తల్లీ నీకు...! పెళ్లి మండపంపైనే రెచ్చిపోయిన వధువు.. పొగ తాగుతూ వరుడికి లిప్‌కిస్..
Bride Smoking Hookah

Updated on: Sep 20, 2023 | 11:40 AM

భారతీయ వివాహాలంటేనే కోలాహలంగా ఉంటాయి. పెళ్లిలో జరిగేవన్నీ గొప్ప గొప్ప వ్యవహారాలే. పెళ్లి కోసం లక్షల డబ్బు ఖర్చు చేస్తారు. ఇక పెళ్లి చూపులు జరిగింది మొదలు.. వేడుక మొదలైనట్టే.. నిశ్చితార్థం, లగ్నపత్రిక వేయించుకోవటం, పెళ్లి మూహూర్తం.. మోహందీ, సంగీత్‌తో పెళ్లి సందడి మొదలవుతుంది. చుట్టాలు, బంధువులు, స్నేహితులు చేసే అల్లరి కూడా ఆకాశనంటుతుంది. ఇక వధూవరుల అలంకరణలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తారు. ఏది ఏమైనప్పటికీ ప్రతి వ్యక్తి జీవితంలో కీలక ఘట్టమైన పెళ్లి విషయంలో వధూవరులు తమ పెళ్లి రోజును ప్రత్యేకించి గుర్తుండిపోయేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు. దాని కోసం కొత్త, విభిన్న, వినూత్న విధానాలను అనుసరిస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై అలాంటి పెళ్లి వేడుకలకు సంబంధించి అనేక వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అయితే, కళ్యాణ మండపంలో ఒక జంట హుక్కా తాగుతూ, ఒకరి నోటిలోకి మరొకరు పొగలు ఊదుకుంటున్న వీడియో ఒకటి ఇంటర్నెట్‌ని షేక్‌ చేసింది. ఈ వీడియోలో వధూవరులు స్టేజ్‌పైనే అందరూ చూస్తుండగా హుక్కా తాగుతూ ఎంజాయ్‌ చేసిన దృశ్యం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది ఆన్‌లైన్‌లో తీవ్ర చర్చకు దారితీసింది.

వైరల్ వీడియోలో, వధువు మెరూన్ మరియు పీచ్ లెహంగాలో పెళ్లి సూట్ ధరించి వరుడి పక్కన నిలబడి ఉంది. ఈ జంట చూసేందుకు అద్భుతంగా కనిపించారు. ఇద్దరూ పెళ్లి వేదికపై నిలబడి ఉన్నారు. అంతలోనే వధువు వేదికపై రెడీగా పెట్టుకున్న ఒక పెద్ద హుక్కా పాట్‌ను హుక్కాను ఆస్వాదిస్తుంది.. అలాగే,..ఆమె వరుడికి ముద్దుపెడుతుంది. అతని నోటిలోకి హుక్కా ఊదింది. అతడు కూడా ఆమెకు సపోర్ట్‌గా హుక్కా పొగ తన నోటిలోకి పీల్చుకుని గాల్లోకి వదులుతున్నాడు.. వధూవరులు చేసిన ఇలాంటి వికృత చేష్టలపట్ల పెళ్లికి వచ్చిన వారంతా ఆశ్చర్యపోయారు. మ్యారేజ్ ఫంక్షన్‌లో ఇలాంటి పనులు చేస్తారా..? అంటూ మండిపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది.

ఇవి కూడా చదవండి

చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ జంట చేసిన పనికి చిర్రెత్తిపోతున్నారు.. హుక్కా తాగడం మంచిది కాదని, అది కూడా కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల సమక్షంలోనే ఇలా చేస్తున్నారంటే.. అంటూ ఘాటుగా విమర్శించారు. నెటిజన్లు సోషల్ మీడియాలో పబ్లిసిటీ కోసం ఇలా చేశారని, మరికొందరు క్యూట్‌గా భావించారని పేర్కొన్నారు. బంధువులు, పురోహితుడి ముందే…వధూవరులు ఒకరినొకరు ముద్దు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియా వినియోగదారులను కూడా తీవ్ర ఆగ్రహనికి గురిచేసింది. రేకెత్తించింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..