Viral Video: రేయ్.. ఎవర్రా మీరంతా.. పెండ్లిలో ఇదేం పనిరా.. కట్‌చేస్తే, ఒక్కసారిగా గాల్లోకి లేచిన కూర్చీలు..

వివాహ వేడుక అంటే ఎట్లుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. బంధుమిత్రులతో సందడి.. సందడిగా ఉంటుంది.. అయితే, తాజాగా జరిగిన సంఘటన వధూవరుల కుటుంబాలకు పెద్ద చిక్కును తెచ్చిపెట్టింది. పెళ్లి సందడిలో ఉన్నట్టుండి గాల్లోకి కూర్చీలు లేశాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Viral Video: రేయ్.. ఎవర్రా మీరంతా.. పెండ్లిలో ఇదేం పనిరా.. కట్‌చేస్తే, ఒక్కసారిగా గాల్లోకి లేచిన కూర్చీలు..
Viral Video
Follow us

|

Updated on: Feb 11, 2024 | 9:39 AM

వివాహ వేడుక అంటే ఎట్లుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. బంధుమిత్రులతో సందడి.. సందడిగా ఉంటుంది.. అయితే, తాజాగా జరిగిన సంఘటన వధూవరుల కుటుంబాలకు పెద్ద చిక్కును తెచ్చిపెట్టింది. పెళ్లి సందడిలో ఉన్నట్టుండి గాల్లోకి కూర్చీలు లేశాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగిన ఓ వివాహ వేడుకలో ఈ ఘటన చోటుచేసుంది. డీజే విషయంలో వివాహ వేడుకలో ఇరువర్గాలు పరస్పరం ఘర్షణ పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కుర్చీలను గాలిలోకి ఎగరవేస్తూ.. చాలా మంది ఒకరినొకరు కుర్చీలతో కొట్టుకోవడం వీడియోలో కనిపిస్తోంది.

వెడ్డింగ్ రిసెప్షన్‌లో డీజే విషయంలో గొడవ..

ఫిబ్రవరి 9న శుక్రవారం రాత్రి అమీనాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంగే నవాబ్ పార్క్ ఎదురుగా ఉన్న బుద్ధ లాల్ బద్లు ప్రసాద్ ధర్మశాలలో వివాహ వేడుక జరిగింది. వెడ్డింగ్ రిసెప్షన్‌ సమయంలో డీజే సాంగ్స్ కు బంధుమిత్రులంతా డ్యాన్స్‌లతో అదరగొడుతున్నారు. ఈ సమయంలో ఘర్షణ చెలరేగింది. ఒకరినొకరు కుర్చీలతో కొట్టుకోవడంతో ముగ్గురికి గాయాలయ్యాయి.

వీడియో చూడండి..

రిసెప్షన్‌లో డీజే పాటలకు డ్యాన్స్‌ చేస్తుండగా తోపులాట జరిగింది. మొదట్లో వధూవరుల కుటుంబసభ్యుల మధ్య ఆహారం విషయంలో వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత వెడ్డింగ్ రిసెప్షన్‌ లో ఈ గొడవ కాస్త భీకర పోరుగా మారిందని స్థానికులు తెలిపారు. ఈ గొడవపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఇరువర్గాలను శాంతింపజేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సమాచారం. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించి, ఫిర్యాదులు అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చాలా మంది ఇంటర్నెట్ వినియోగదారులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. పలు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రూ. 15వేలోనే 108 ఎంపీ కెమెరా.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ ఫోన్‌
రూ. 15వేలోనే 108 ఎంపీ కెమెరా.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ ఫోన్‌
ప్రజాస్వామ్య బలోపేతానికి మోదీ పునాది వేశారు.. అమిత్ షా
ప్రజాస్వామ్య బలోపేతానికి మోదీ పునాది వేశారు.. అమిత్ షా
FCRA చట్టాన్ని మరింత బలోపేతం చేస్తామన్న కేంద్ర మంత్రి అమిత్ షా
FCRA చట్టాన్ని మరింత బలోపేతం చేస్తామన్న కేంద్ర మంత్రి అమిత్ షా
మోదీ 10 ఏళ్లలోనే నిజం చేసి చూపించారు.. టీవీ9 సమ్మిట్‌లో అమిత్‌షా
మోదీ 10 ఏళ్లలోనే నిజం చేసి చూపించారు.. టీవీ9 సమ్మిట్‌లో అమిత్‌షా
కేటీఆర్‌కు సీఎం రేవంత్‌ సవాల్‌.. ఒక్క సీటు గెలిచి చూపించండి అంటూ
కేటీఆర్‌కు సీఎం రేవంత్‌ సవాల్‌.. ఒక్క సీటు గెలిచి చూపించండి అంటూ
పోలవరం విషయంలో ఏపీ సర్కార్ సీరియస్‌గా లేదు: రాజ్‌నాథ్ సింగ్‌
పోలవరం విషయంలో ఏపీ సర్కార్ సీరియస్‌గా లేదు: రాజ్‌నాథ్ సింగ్‌
మహేశ్ బాబు మెచ్చిన 'పోచర్' వెబ్ సిరీస్‌ .. ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
మహేశ్ బాబు మెచ్చిన 'పోచర్' వెబ్ సిరీస్‌ .. ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
రేయ్ ఎవర్రా మీరంతా.! ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయ్.. దున్నపోతుపై..
రేయ్ ఎవర్రా మీరంతా.! ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయ్.. దున్నపోతుపై..
ప్రశాంత్ నీల్ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరో తెలుసా.?
ప్రశాంత్ నీల్ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరో తెలుసా.?
మోదీ నాయకత్వంలో గెలుపు అలవాటుగా మారింది, అమిత్ షా..
మోదీ నాయకత్వంలో గెలుపు అలవాటుగా మారింది, అమిత్ షా..