Viral Photo: ఈ ‘M’ ఫోటోలోని ‘N’ అక్షరాన్ని గుర్తించగలరా.? కనిపెడితే మీ కళ్లకు పదునున్నట్లే!

|

Jul 23, 2022 | 6:53 PM

మరోసారి మీ ముందుకు వచ్చేశాం.. కళ్లు చెదిరే పజిల్ మీకోసం తెచ్చేశాం. మిమ్మల్ని తికమక పెడుతుంది. మేధావులను సైతం మభ్యపెడుతుంది. మరి అదేంటో చూసేద్దాం పదండి.!

Viral Photo: ఈ M ఫోటోలోని N అక్షరాన్ని గుర్తించగలరా.? కనిపెడితే మీ కళ్లకు పదునున్నట్లే!
Viral Photo1
Follow us on

సాధారణంగా పజిల్స్ అంటే అందరికీ ఇష్టముంటుంది. ముఖ్యంగా సవాళ్లను ఇష్టపడేవారు.. వీటిని చిటికెలో సాల్వ్ చేసేస్తారు. తగ్గేదేలే అన్నట్లుగా ఓ పట్టు పడతారు. సుడోకోలు, పద సంపత్తి ఒక ఎత్తయితే.. ఫోటో పజిల్స్ మరో ఎత్తు. ఇక ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు నెక్స్ట్ లెవెల్ అనుకోండి. ప్రతీ ఫోటో పజిల్ ఓ డైమెండ్. మకతిక.. తికమక పెట్టేస్తాయి. అలాంటి కోవకు చెందిన ఓ ఫోటో పజిల్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇది మీ ఐక్యూ లెవెల్‌ను కూడా పెంచుతది. పైన పేర్కొన్న ఫోటోను మీరు చూశారా.? మొత్తం ‘M’ లెటర్ నిండి ఉంది కదూ.! వెయిట్.. వెయిట్.. అందులో ఓ తప్పు ఉంది. అదెక్కడుందో మీరు గుర్తించాలి. ఫోటోను పైపైన చూస్తే మీరు కనిపెట్టలేరు. నిశితంగా చూస్తేనే మీకు ఆ తప్పు కనిపిస్తుంది. అందులో ఓ డిఫరెంట్ Letter ఉంది. చూడండి.. మీరు పజిల్ సాల్వ్ చేసేస్తే ఓకే.. లేదంటే సమాధానం కోసం కింద ఫోటోను చూడండి.

సమాధానం: మీకు 3వ వరుసలో మరో letter దొరుకుతుంది.