భార్య నంబర్‌ను ఆ పేరుతో సేవ్‌ చేసుకున్న భర్త! కోర్టు చూడండి ఎంత పెద్ద శిక్ష వేసిందో..?

టర్కీలో సంచలనం సృష్టించిన విడాకుల కేసు వివరాలు. భార్య లావుగా ఉందని బాడీ షేమింగ్ చేసి, ఫోన్‌లో అవమానకరమైన పేరుతో సేవ్ చేసిన భర్త. మానసిక వేధింపులతో విసిగిపోయిన భార్య కోర్టుకు వెళ్లగా, న్యాయమూర్తి ఆమె పక్షాన తీర్పునిచ్చారు. భర్త ఆరోపణలు నిరాధారమని తేల్చి, అతనికి శిక్ష విధించారు.

భార్య నంబర్‌ను ఆ పేరుతో సేవ్‌ చేసుకున్న భర్త! కోర్టు చూడండి ఎంత పెద్ద శిక్ష వేసిందో..?
Court

Updated on: Oct 25, 2025 | 1:48 PM

భార్యాభర్తల మధ్య గొడవలు కామన్‌ అని చాలా మంది చెబుతుంటారు. ఓ ఇంత చిన్న విషయానికే గొడవపడ్డారా అని పెద్దలు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంటారు. అయితే నిజానికి కొన్ని సార్లు సమస్య చాలా చిన్నగా అనిపించినా.. అది వారిని మానసికంగా చాలా క్షోభకు గురి చేసి ఉంటుంది. తాజాగా ఓ వ్యక్తి తన భార్య నంబర్‌ను తన ఫోన్‌లో వ్యంగ్యమైన పేరుతో సేవ్‌ చేసుకున్నాడు. ఆమె కాస్త లావుగా ఉండటంతో ఆమెకు బండది అనే అర్థం వచ్చేలా తన ఫోన్‌లో ఆమె నంబర్‌ సేవ్‌ చేసుకున్నాడు.

ఇదే వారి విడాకులు కేసులో ప్రధానంగా నిలిచింది. టర్కీ దేశంలో దంపతుల మధ్య విభేదాలు వచ్చి.. భార్య తన భర్త నుంచి విడాకులు కావాలి, అతను తనను మానసికంగా వేధిస్తున్నాడంటూ కోర్టులో కేసు వేసింది. ఆ తర్వాత భర్త కూడా ఆమెకు అక్రమ సంబంధం ఉందంటూ కోర్టులో విడాకుల కోసం అప్లై చేశాడు. ఈ కేసు విచారణలో భాగంగా సంచలన విషయాలు వెలుగు చూశాయి. భార్య లావుగా ఉండటంతో ఆమె అస్యహించుకునే భర్త, హేళన చేస్తూ ఆమెను వేధించేవాడు. అతని ఫోన్‌లో కూడా ఆమె పేరును బాడీ షేమింగ్‌ చేసేలా సేవ్‌ చేసుకున్నాడు.

కోర్టులో ఈ ఆధారలన్నీ ఆమె బయటపెట్టింది. అతను ఆమెకు పంపిన వ్యంగ్యమైన మెసేజ్‌లు, నా నుండి దూరంగా ఉండు, నేను నిన్ను చూడాలనుకోవడం లేదు అంటూ అతను పంపిన మెసేజ్‌లు అన్ని జడ్డికి చూపించింది. దీంతో ఆమె ఎంత మానసిక వేధన అనుభవిస్తుందో గ్రహించిన న్యాయమూర్తి ఆమె పక్షంలో తీర్పు వెల్లడించారు. భర్త చేసిన అవిశ్వాస ఆరోపణ నిరాధారమైనదని కోర్టు తేల్చింది. ఆమెతో అక్రమ సంబంధం అంటగట్టిన వ్యక్తి కేవలం ఒక పుస్తకాన్ని అందించడానికి వచ్చాడని, వారి మధ్య ఎటువంటి ప్రేమ సంబంధం లేదని దర్యాప్తులో తేలింది. భర్త కావాలనే ఆమెను మానసికంగా, ఆర్థికంగా వేధించాడని భావిస్తూ అతని శిక్ష విధించింది.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి