Digital Beggar: ఆ బిచ్చగాడి ఐడియా చూసి అవాక్కవుతున్నారు తోటి బెగ్గర్లు. పెరుగుతున్న టెక్నాలజీని బిచ్చగాడు అందిపుచ్చుకున్న తీరును చూసిన వారంతా అబ్బుర పడుతున్నారు. ఏం తెలివిరా బాబూ అంటూ అభినందిస్తున్నారు. ఇంతకీ ఆ బిచ్చగాడు చేసిందేమిటి? ఎందుకింతలా ఫేమస్ అయ్యాడో చూద్దాం. పెరుగుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకున్నాడో (Digital Beggar) బిచ్చగాడు. ధర్మం చేయండి బాబు.. క్యూఆర్ కోడ్ యాక్సెప్టెడ్ బోర్డును మెడలో వేసుకుని మరీ అడుక్కుంటున్నాడు. అతడే బీహార్‌కు చెందిన రాజు పటేల్. అతడికి వచ్చిన ఐడియాను చూసిన తోటి బిచ్చగాళ్లు నోరెళ్లబెడుతున్నారు. బీహార్‌లో బెట్టియా (Bettiah) రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఈ హైటెక్ బిచ్చగాడు రాజు పటేల్ ను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. రాజు పటేల్ రైల్వేస్టేషన్లు, రైళ్లలో అడుక్కుంటూ కొన్నేళ్లుగా అక్కడే జీవిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో డిజిటల్ పేమెంట్స్ బాగా పెరగడంతో అతడికి బిచ్చం వేసేవారు తగ్గిపోయారు. ఎవరిని ధర్మం అడిగినా చిల్లర లేదంటూ చెప్పడం కామన్ అయిపోయింది.
మారుతున్న ట్రెండ్‌కి తగ్గట్టుగా అప్‌డేట్ అయ్యాడు రాజు పటేల్. గతంలో బిచ్చం ఎత్తుకోగా వచ్చిన డబ్బుతో ఓ బ్యాంకులో ఖాతా ఓపెన్ చేశాడు. దాని ఆధారంగా ఓ ఈ వాలెట్ – క్యూ ఆర్ కోడ్ సాధించాడు. ఎప్పటిలాగే స్టేషన్ ఆవరణలో బిచ్చం అడుక్కోవడం ప్రారంభించాడు. అయితే కొత్త పద్దతి ఎంచుకున్నాడు. మెడలో క్యూఆర్ కోడ్ ఉన్న ప్లకార్డు, చేతిలో ట్యాబ్‌తో.. ధర్మం చేయండి బాబు అని వేడుకుంటాడు. ఎవరైనా బిచ్చం వేయబోతే వెంటనే మెడలో క్యూఆర్ కోడ్ చూపిస్తాడు. అక్కడితో ఆగిపోలేదు.. తనకు బిచ్చం వస్తుందో రావట్లేదో తెలుసుకునేందుకు ఓ ట్యాబ్ కూడా కొనుక్కున్నాడు.
Bihar | Raju Patel, a beggar in Bettiah, goes digital; accepts PhonePe & puts a QR code around his neck
“I accept digital payments, it’s enough to get the work done & fill my stomach,” said Raju Patel
Visuals from Bettiah railway station pic.twitter.com/nbw83uXop6
— ANI (@ANI) February 8, 2022
గతంలో డిజిటల్ పేమెంట్స్‌పై కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ గంగిరెద్దులు ఆడించే వ్యక్తి క్యూఆర్ కోడ్‌తో దానాలు స్వీకరించే వీడియోను షేర్ చేశారు. ఇండియాలో డిజిటల్ పేమెంట్స్ వృద్ధికి ప్రతీకగా ఆ వీడియోను చూపారు మంత్రి. ఇప్పుడు అంతకు మించి అన్నట్టుగా రాజుపటేల్ వైరలయ్యాడు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే బీహార్‌లో ఓ బిచ్చగాడు మెడలో క్యూ ఆర్ కోడ్ తగిలించుకుని బిచ్చమెత్తుకోవడం వైరల్‌గా మారింది. రాజుపటేల్ క్యూఆర్ కోడ్‌తో అడుక్కోవడంపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. డిజిటల్ ఇండియాగా మారిందనడానికి సంకేతమని కొందరంటే..ఎంత టెక్నాలజీ పెరిగినా పేదరికం అలాగే ఉందని మరికొందరు పెదవి విరుస్తున్నారు.
Also Read: