Bengaluru: రోడ్డు మధ్యలో కుర్చీ వేసుకొని రీల్.. పోలీసుల రాకతో సీన్‌ రివర్స్‌!

రద్దీగా ఉన్న రోడ్డుపై కుర్చీ వేసుకొని టీ తాగుతూ ఇన్‌స్టా రీల్‌ చేసిన ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన బెంగళూరులోని మగడి రోడ్డులో చోటుచేసుకుంది. ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్దంగా, ప్రజల భద్రతకు విఘాతం కలిగించే ఇలాంటి ప్రమాదకర స్టంట్లు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Bengaluru: రోడ్డు మధ్యలో కుర్చీ వేసుకొని రీల్.. పోలీసుల రాకతో సీన్‌ రివర్స్‌!
Bcp Police

Updated on: Apr 18, 2025 | 10:52 AM

యువతకు రోజురోజుకు రీల్స్‌ పిచ్చి పెరిగిపోతుంది. సోషల్‌ మీడియాలో ఫేమస్‌ అవ్వడం కోసం..వింతవితం ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది ప్రమాదకర రీల్స్‌ చేస్తూ ప్రాణాలు కోల్పోతుంటే..మరికొందరూ జైలుకెళ్లి ఊచలులెక్కపెడుతున్నారు. రీల్స్‌ కోసం ప్రమాదకర స్టంట్స్‌ చేయొద్దని అటు పోలీసులు హెచ్చిరించినా వినట్లేదు..రోజు ఎక్కడో అక్కడ ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ పోలీసులకు చిక్కుతూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటనే బెంగళూరులో చోటుచేసుకుంది. రద్దీగా ఉన్న రోడ్డు మధ్యలో కుర్చీ వేసుకుని టీ తాగుతూ రీల్స్ చేసిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బెంగళూరులో ఎప్పుడూ రద్దీగా ఉండే మగడి రోడ్డుపై ఓ యువకుడు రీల్స్‌ చేశాడు. రోడ్డు మధ్యలో కుర్చీ వేసుకొని టీ తాగుతూ రీల్‌ చేశాడు. ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఆ వీడియో కాస్త వైరల్‌గా మారి పోలీసుల దృష్టికి చేరింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ వీడియో ద్వారా యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ట్రాఫిక్‌ రూల్స్‌కు విరుద్దంగా రీల్స్‌ చేశారని అతన్ని అరెస్ట్ చేశారు. ఆ యువకుడు చేసిన రీల్‌ వీడియోను పోలీసులు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ట్రాఫిక్‌ రూల్స్‌కు విరుద్ధంగా, ప్రజల భద్రతకు విఘాతం కలిగించే ఇలాంటి ప్రమాదకర స్టంట్లు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…