Viral Video: ద్యావుడా! ఇలాంటి గర్ల్‌ఫ్రెండ్‌ దొరకాలంటే రాసి పెట్టి ఉండాలి.. చూస్తే లవ్‌లో పడిపోతారంతే!

|

Mar 22, 2022 | 3:16 PM

రిలేషన్ ఏదైనా కూడా అది ఎక్కువ కాలం నిలబడాలంటే.. ఆడ, మగ ఇద్దరూ ఒకరినొకరు కచ్చితంగా అర్ధం చేసుకోవాలి. అంతేకాదు..

Viral Video: ద్యావుడా! ఇలాంటి గర్ల్‌ఫ్రెండ్‌ దొరకాలంటే రాసి పెట్టి ఉండాలి.. చూస్తే లవ్‌లో పడిపోతారంతే!
Camera
Follow us on

రిలేషన్ ఏదైనా కూడా అది ఎక్కువ కాలం నిలబడాలంటే.. ఆడ, మగ ఇద్దరూ ఒకరినొకరు కచ్చితంగా అర్ధం చేసుకోవాలి. అంతేకాదు ఏ విషయంలోనైనా తాను గొప్ప అంటే.. తాను గొప్ప అని అనుకోకూడదు. ఎవరొకరు తగ్గాల్సిందే. అప్పుడే రిలేషన్‌షిప్‌ మంచిగుంటుంది. సరే.! ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.! తాజాగా ఓ లవ్లీ కపుల్‌కు సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ కపుల్ మరెవరో కాదు.. నిక్ అండ్ క్యారీ.. వీళ్లకు ఇన్‌స్టా, టిక్‌టాక్‌లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. మీరు కూడా ఆ వీడియో చూశాక అలాంటి అమ్మాయి గర్ల్‌ఫ్రెండ్‌గా దక్కాలంటే.. రాసి పెట్టి ఉండాలంటారు.

వైరల్ వీడియో ప్రకారం.. తాను కెమెరాను పగలగొట్టానని ఓ యువతి తన లవర్ దగ్గర జరిగిన విషయాన్ని చెబుతున్నట్లు మీరు చూడవచ్చు. తన బాయ్ ఫ్రెండ్ ఎక్కడ కోపగించుకుంటాడోనని.. ముందుగానే ‘బేబీ ఇది గుర్తుపెట్టుకో.. త్వరలోనే మనిద్దరం భార్యాభర్తలు కాబోతున్నాం’ అని పేర్కొంటూ చేసిన తప్పును బహిర్గతం చేస్తుంది. అంతే ఇంకేముంది పరిగెత్తుకుంటూ వెళ్లి కబోర్డులో దాక్కుని ఏడుస్తుంది. ఇంత ముద్దు.. ముద్దుగా తన తప్పును ఒప్పుకుంటే.. పాపం బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తాడు చెప్పండి.! ప్రేమగా దగ్గరకు తీసుకోవడం తప్ప వేరే మార్గం ఉండదు కదా.! ఇక్కడ కూడా అదే జరిగింది. అతగాడు ఆమె వెంట వెళ్లి.. ప్రేమగా దగ్గరకు తీసుకుని.. కొత్త కెమెరా కొనుక్కుందాం లే.. ఇందులో నీ తప్పు ఏం లేదంటూ ఓ ముద్దు ఇచ్చి బుజ్జగించాడు.

కాగా, ఈ వీడియోకు ఇప్పటివరకు 47 వేలకు పైగా లైకులు, లక్షల్లో వ్యూస్ వచ్చాయి. స్వీట్ కపుల్ అంటూ ఇద్దరిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి వీడియో చూసేయండి..