
ప్రజంట్ సోషల్ మీడియా ఏ రేంజ్‌లో డెవలప్ అయిందో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం రకరకాల వీడియోలు, పోస్టులు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఇక మీమ్స్, పరీక్షల్లో విద్యార్థులు రాసే ఫన్నీ ఆన్సర్స్, ఆప్టికల్ ఇల్యూజన్ పజిల్స్.. ఇలాంటి ఫన్ కంటెంట్‌కు కొదవే లేదు. తాజాగా ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఒక్క అక్షరం తేడా వస్తే.. పదదోషం ఎలా జరుగుతుందో చెప్పే పోస్ట్ ఇది. ఒక సాధారణ అక్షర దోషం ఒక మాములు ఇన్విటేషన్‌ను వైరల్‌గా మార్చగలరదని దీని ద్వారా అర్థమవుతుంది. ప్రజలు ఈ పోస్ట్‌పై ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. వాస్తవానికి ఇది ఓ బేబి షవర్ కార్యక్రమానికి సంబంధించిన ఇన్విటేషన్ అనమాట. అక్కడ Auspicious అకేషన్ అని పెట్టాల్సింది.. పోయి.. Suspicious అకేషన్ అని పెట్టారు. దీంతో మొత్తం భావం మారిపోయింది. Auspicious అకేషన్ అంటే శుభకరమైన సందర్భం.. కానీ Suspicious అకేషన్ అంటే “అనుమానాస్పద సందర్భం” గా మారిపోయింది. ఒక X యూజర్ ఈ ఇన్విటేషన్ స్క్రీన్ షాట్‌ను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తూ “అత్యంత చెత్త అక్షర దోషం” అని పేర్కొన్నారు. నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తూ ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ 38,100 కంటే ఎక్కువ వ్యూస్ పొందింది. జనాలు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.
అరెరె.. చూసుకోవాలి కదా అని ఒకరు పేర్కొనగా.. ఇప్పుడు అందరం డిక్షనరీ వాడుతున్నాం.. ఈ తప్పు ఎలా దొర్లింది అని మరొకరు పేర్కొన్నారు. ఉరుకుల, పరుగుల జీవితంలో ఇవన్నీ కామన్. అంతగా ట్రోల్ చేయాల్సిన అవరసం లేదు అని మరొకరు పేర్కొన్నారు. ఇది ఒక ఉదాహారణ.. ముఖ్యమైన మెసేజీలు చేసేటప్పుడు అన్నీ ముందుగా చూసుకోవాలి. లేదంటే ఇలా బ్లేమ్ అవుతామని మరొకరు పేర్కొన్నారు. మొత్తంగా ఈ పోస్ట్ ఇప్పుడు మస్త్ ట్రెండ్ అవుతుంది అండోయ్.
This had to be the worst typo ever 😭😭 pic.twitter.com/e7q37nsbrd
— bittsssss (@notwhatshrisaid) April 30, 2024
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..