Viral Video: మట్టిని తవ్వుతుండగా కనిపించిన వింత రాయి.. విచిత్రంగా ఉందని పగలగొట్టి చూడగా.!

|

May 01, 2024 | 12:01 PM

మట్టిలో తవ్వకాలు జరిపిన ప్రతీసారి చిత్రవిచిత్రమైన వస్తువులు దొరుకుతుండటం మనం చూస్తూనే ఉంటాం. పొలం పనులు చేస్తుండగా వజ్రాలు బయటపడటం, పురాతన ఇంటిని కూల్చుతుండగా బంగారు నాణేలు లభ్యం కావడం వంటి వీడియోలు తరచూ నెట్టింట వైరల్ అవుతుంటాయి..

Viral Video: మట్టిని తవ్వుతుండగా కనిపించిన వింత రాయి.. విచిత్రంగా ఉందని పగలగొట్టి చూడగా.!
Viral Video
Follow us on

మట్టిలో తవ్వకాలు జరిపిన ప్రతీసారి చిత్రవిచిత్రమైన వస్తువులు దొరుకుతుండటం మనం చూస్తూనే ఉంటాం. పొలం పనులు చేస్తుండగా వజ్రాలు బయటపడటం, పురాతన ఇంటిని కూల్చుతుండగా బంగారు నాణేలు లభ్యం కావడం వంటి వీడియోలు తరచూ నెట్టింట వైరల్ అవుతుంటాయి. ఇటీవల ఓ వ్యక్తి తవ్వకాలు జరపగా ఓ వింత రాయి బయటపడింది. ఆ రాయి ఏంటో విచిత్రంగా ఉందని పగలగొట్టి చూడగా.! అందులో కనిపించిన దృశ్యాన్ని చూసి దెబ్బకు షాక్ అయ్యారు..

వైరల్ వీడియో ప్రకారం.. ప్రాంతం ఏంటో తెలియదు గానీ.. ఓ వ్యక్తి మట్టిలో తవ్వకాలు జరిపాడు. ఈ క్రమంలోనే అతడికి ఓ వింత రాయి కనిపించింది. దాన్ని బయటకు తీసి చూడగా.. అది ఎందుకో విచిత్రంగా ఉండటంతో దాన్ని సుత్తి, ఇనుప మొలతో పగలగొట్టి చూడగా.. అందులో అతడ్ని ఆశ్చర్యపరుస్తూ పురాతన ఆభరణాలు బయటపడ్డాయి. ఇది నిజమో, కాదో తెలియదు గానీ.. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘ఇలాక్కుడా జరుగుతుందా’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘ఇదంతా కూడా వ్యూస్, లైకుల కోసం చేశారని’ మరొకరు కామెంట్ చేశారు. లేట్ ఎందుకు వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.