Viral Video: మట్టిలో పాతిపెట్టిన చిన్న కుండ.. దొరికిన పురాతన నిధి.. అదేంటంటే.!

గతంలో పురావస్తు తవ్వకాలు, గుప్తనిధుల కోసం వేట అంటేనే అదొక సంచలనం అనమాటే. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి అన్నీ కూడా కామన్ అయిపోయాయి. ఎవరొకరు మెటల్ డిటెక్టర్ పట్టుకుని తిరగడం.. పురాతన నిధి అంటూ బయటికి తీయడం జరుగుతోంది.

Viral Video: మట్టిలో పాతిపెట్టిన చిన్న కుండ.. దొరికిన పురాతన నిధి.. అదేంటంటే.!
Viral Video

Updated on: May 10, 2024 | 7:51 PM

గతంలో పురావస్తు తవ్వకాలు, గుప్తనిధుల కోసం వేట అంటేనే అదొక సంచలనం అనమాటే. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి అన్నీ కూడా కామన్ అయిపోయాయి. ఎవరొకరు మెటల్ డిటెక్టర్ పట్టుకుని తిరగడం.. పురాతన నిధి అంటూ బయటికి తీయడం జరుగుతోంది. ఇటీవల ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.! ప్రాంతం ఎక్కడో తెలియదు గానీ.. ఓ వ్యక్తి మట్టిని తవ్వి తీస్తుండగా.. ఓ చిన్న కుండ బయటపడింది. అందులోని మట్టిని తీసేందుకు దానికి మంట అంటించాడు. ఇక ఆ తర్వాత ఆ కుండలో నుంచి పురాతన ఆభరణాలు లభ్యమయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కాగా, దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. కొందరు ఇది ఫేక్ అని అంటుంటే.. మరికొందరు బయటపడ్డ ఈ పురాతన నిధి నిజం కావచ్చునని అన్నారు. మరి లేట్ ఎందుకు మీరూ వీడియోపై లుక్కేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us