నేనొచ్చా.. తలుపు తియ్యరే..

| Edited By:

May 03, 2019 | 6:47 PM

మొసళ్లను దూరం నుంచి చూస్తేనే గుండెలు జారిపోతాయి. అలాంటిది ఇంటి ముందరకే వస్తే… మన తలుపు మూసి ఉందని.. డోర్ తడితే ఏలా ఉంటుంది. ఊహించుకుంటేనే.. గుండెలు జారీపోతున్నాయి కదా. అయితే అలాంటి ఘటన ఒకటి దక్షిణ కరోలీనాలోని మైర్టెల్ బీచ్ సమీపంలో చోటుచేసుకుంది. ఓ మహిళ ఇటీవలే బీచ్ సమీపంలో కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. అనంతరం షాపింగ్ కు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి చేరుకుంది. అయితే అక్కడ జరుగుతున్న ఘటనను చూసి షాక్‌కు […]

నేనొచ్చా.. తలుపు తియ్యరే..
Follow us on

మొసళ్లను దూరం నుంచి చూస్తేనే గుండెలు జారిపోతాయి. అలాంటిది ఇంటి ముందరకే వస్తే… మన తలుపు మూసి ఉందని.. డోర్ తడితే ఏలా ఉంటుంది. ఊహించుకుంటేనే.. గుండెలు జారీపోతున్నాయి కదా. అయితే అలాంటి ఘటన ఒకటి దక్షిణ కరోలీనాలోని మైర్టెల్ బీచ్ సమీపంలో చోటుచేసుకుంది. ఓ మహిళ ఇటీవలే బీచ్ సమీపంలో కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. అనంతరం షాపింగ్ కు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి చేరుకుంది. అయితే అక్కడ జరుగుతున్న ఘటనను చూసి షాక్‌కు గురైంది.

ఎందుకంటే ఆమె ఇంటి గుమ్మం ముందు ఓ నాలుగైదు అడుగులున్న మొసలి ఒకటి కనిపించింది. కనిపిస్తే సమస్య ఉండపొయేది.. కానీ అది నేనొచ్చాను.. డోర్ తీయండని చెప్పడానికి.. ఏకంగా డోర్ కాలింగ్ బెల్ కొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. దీంతో ఈ తతంగాన్ని తన ఫోన్ లో రికార్డు చేసింది సదరు మహిళ. అనంతరం జంతు సంరక్షణ అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. అక్కడకు చేరుకున్న అధికారులు.. ఆ చిలిపి మొసలిని పట్టుకుని సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.