Viral Video: ఈ వర్కఅవుట్‌లు చూస్తే షాక్ అవ్వాల్సిందే.. నెట్టింట్లో వైరలవుతోన్న 5 నెలల చిన్నారి వీడియో..

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో ఓ అద్భుతమైన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ అయింది. ఇది ఇప్పటివరకు 34 మిలియన్లకు పైగా వ్యూస్‌ని పొందింది.

Viral Video: ఈ వర్కఅవుట్‌లు చూస్తే షాక్ అవ్వాల్సిందే.. నెట్టింట్లో వైరలవుతోన్న 5 నెలల చిన్నారి వీడియో..
5 Months Baby Viral Video

Updated on: Jun 01, 2022 | 6:45 AM

చిన్న పిల్లలు ఎంతో అల్లరి చేస్తుంటారనేది మనకు తెలిసిందే. ఇంట్లో రోజంతా సందడి చేస్తూనే ఉంటారు. వంటింటి నుంచి హాల్, బెడ్ రూంలోని సామాన్లను చిందరవందర చేసి విధ్వంసానికి పాల్పడుతుంటుంటారు. ఇటువంటి పరిస్థితిలో, పిల్లలను ఇలా చేయకుండా ఆపడం చాలా కష్టం. అయితే, ఇలాంటివి చేయకుండా మంచి బుద్ధులు నేర్పించడం తల్లిదండ్రుల కర్తవ్యం. అప్పుడే పిల్లలు బాగా నేర్చుకుంటారు. వాస్తవానికి, పిల్లలకు ఏదైనా నేర్పిస్తే, వారు త్వరగా నేర్చుకుంటారు. అవును, వారికి ఏది ఒప్పో.. ఏది తప్పేదో తెలియదు. అందుకే ఈ విషయాలన్నీ వారికి చెప్పాల్సిన అవసరం పేరెంట్స్‌పైనే ఉంటుంది. తాజాగా నెట్టింట్లో ఓ 5 నెలల పిల్లవాడు చేసిన సందడి చేసిన వీడియో తెగ వైరల్(Viral) అవుతుంది. ఇది అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

ఒక మహిళ ఎలా వర్కవుట్ చేస్తుందో వీడియోలో చూడొచ్చు. తన తల్లిని కాపీ చేయడానికి ప్రయత్నిస్తున్న ఆ చిన్న పిల్లవాడిని కూడా వీడియోలో చూడోచ్చు. అతను కూడా తన తల్లిలాగే స్ట్రెచింగ్ వ్యాయామాలు చేస్తూ కనిపిస్తాడు. కేవలం 5 నెలల వయసులోనే ఇలా చేయండంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. సాధారణంగా ఇంత చిన్న వయస్సులో ఉన్న పిల్లలు తమ శరీరాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేయలేకపోతున్నప్పటికీ, వీడియోలో కనిపించే ఈ చిన్నారి తన బ్యాలెన్స్‌ను సక్రమంగా చేసి చూపించింది. ఇలాంటి వ్యాయామాలు చేసే చిన్న పిల్లాడిని మీరు చాలా అరుదుగా చూసి ఉంటారు.

ఇవి కూడా చదవండి

ఈ అద్భుతమైన, చురుకైన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Instagramలో fitstagram.michelle అనే IDతో షేర్ చేశారు. ఇది ఇప్పటివరకు 34 మిలియన్లకు పైగా వీక్షణలను పొందింది. అంటే 34 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అదే సమయంలో ఈ వీడియో చూసిన తర్వాత నెట్టింట్లో పలు రకాల రియాక్షన్‌లు ఇచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ చూద్దాం..

Loading...
Unable to load recommendations.
Follow Us