Priya Prakash Varrier: కచా బాదం పాటకు స్టెప్పులేసిన ప్రియా ప్రకాష్.. నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్న వీడియో..

సోషల్ మీడియాలో ఇప్పుడు కచా బాదం (kacha badam) సాంగ్ ఎంతలా ట్రెండ్ అవుతుందో చెప్పాల్సిన పనిలేదు.

Priya Prakash Varrier: కచా బాదం పాటకు స్టెప్పులేసిన ప్రియా ప్రకాష్.. నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్న వీడియో..
Priya Prakash Varrier

Updated on: Feb 12, 2022 | 5:27 PM

సోషల్ మీడియాలో ఇప్పుడు కచా బాదం (kacha badam) సాంగ్ ఎంతలా ట్రెండ్ అవుతుందో చెప్పాల్సిన పనిలేదు. చిన్నా, పెద్ద వయసుతో సంబంధం లేకుండా ఈ పాటను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధిన వీడియోస్ నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. కచా బాదం పాటకు సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు సైతం ఫిదా అయ్యి తమ స్టైల్లో స్టె్ప్పులేస్తున్నారు. ఇప్పటికే స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ.. కచా బాదం పాటకు డ్యాన్స్ చేసి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ సైతం కచా బాదం పాటకు స్టె్ప్పులేస్తూ అదరగొట్టింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‎గా ఉంటారో తెలిసిందే. నెట్టింట్లో అత్యథిక ఫాలోవర్లను సొంతం చేసుకున్న నటీమణులలో ఈ మలయాళీ ముద్దుగుమ్మ కూడా ఒకరు. ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ నెటిజన్లను అట్రాక్ట్ చేసే ప్రియా ప్రకాష్.. తాజాగా.. సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నా కచా బాదం పాటకు డ్యాన్స్ చేసింది. ఈ వీడియోను తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ.. నేను దీనిని నియంత్రించలేకపోయాను.. అంటూ స్మైలీ ఎమోజీ షేర్ చేసింది. ఇక ఈ వీడియోను చూసిన ఆమె ఫాలోవర్స్..వావ్.. సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోను మీరు ఓసారి చూసేయ్యండి.

Also Read: Sudheer Babu: కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించిన సుధీర్‌ బాబు.. ఆసక్తికరంగా ఫస్ట్‌ లుక్‌..

Meenakshi Chaudhary: వరుస అవకాశాలు అందుకుంటున్న హర్యానా బ్యూటీ “మీనాక్షి చౌదరి”..(ఫొటోస్)

Geetha Madhuri: సెంటర్ అఫ్ ఎట్రాక్షన్ ‘గీత మాధురి’ ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో సింగర్ లేటెస్ట్ ఫొటోస్..

Keerthy Suresh : మహేష్ సినిమాకోసం ఈ ముద్దుగుమ్మ మొదటిసారి అలా కనిపించనుందట..