Viral Video: కారు ఎక్కేందుకు వెళ్లిన మహిళ.. అది చూసి భయంతో పరుగులు తీసింది.. షాకింగ్ వీడియో మీకోసం..

|

Sep 21, 2021 | 2:35 PM

Viral Video: సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలో సర్క్యూలేట్ అవుతుంటాయి. వాటిలో చాలా వరకు ఫన్నీ వీడియోలే ఉంటాయి. మరికొన్ని షాకింగ్, అవాక్కయ్యే వీడియోలు ఉంటాయి.

Viral Video: కారు ఎక్కేందుకు వెళ్లిన మహిళ.. అది చూసి భయంతో పరుగులు తీసింది.. షాకింగ్ వీడియో మీకోసం..
Bear
Follow us on

Viral Video: సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలో సర్క్యూలేట్ అవుతుంటాయి. వాటిలో చాలా వరకు ఫన్నీ వీడియోలే ఉంటాయి. మరికొన్ని షాకింగ్, అవాక్కయ్యే వీడియోలు ఉంటాయి. వాటిని చూసి నెటిజన్లు బిత్తరపోతుంటారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో కాస్త భయంగా, ఇంకాస్త ఫన్నీగా ఉంది. ఈ వీడియో చూసి కొందరు నెటిజన్లు నవ్వుకుంటుంటే.. మరికొందరు భయంగా ఫీలవుతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఓ మహిళ ఇంట్లో నుంచి పళ్ల బుట్టను పట్టుకుని కారు వద్దకు వెళ్లింది. కారులో కూర్చునేందుకు వెళ్లగా.. అప్పటికే కార్ డోర్ ఓపెన్ చేసి ఉంది. అదేమీ పట్టించకోకుండా మహిళ కారును సమీపించింది. డోర్ వద్దకు వెళ్లగానే.. నల్లటి భారీ శరీరం కలిగిన ఎలుగుబంటి ఆమె కంట పడింది. వెంటనే భయంతో పెద్ద పెట్టున కేకలు పెట్టింది. ఏం చేయాలో తెలియక కాసేపు అయోమయానికి గురైంది. తెరిచి ఉన్న కార్ డోర్‌ను క్లోజ్ చేసేందుకు ప్రయత్నించింది. ఆ తరువాత చేతిలో పళ్ల బుట్టను కింద పడేసి పెద్దగా అరుస్తూ ఇంట్లోకి పరుగులు తీసింది. అయితే, మహిళ అరుపులతో ఎలుగుబంటి కూడా బెంబేలెత్తిపోయింది. భయంతో కారు నుంచి దిగి పరుగులు తీసింది. ఆ తరువాత మళ్లీ కారువైపునకు వచ్చింది. కాగా, ఈ ఘటన అంతా ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆ వీడియోను ట్విట్టర్ యూజర్ షేర్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు ఈ వీడియోను 44 లక్షల మందికిపైగా వీక్షించారు. లక్షకు పైగా లైక్స్, వేలాది కామెంట్స్ వచ్చాయి. ఈ ఫన్నీ వీడియోను మీరు కూడా చూసేయండి.

Viral Video:

Also read:

Privilege Committee: టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్న, నిమ్మలపై చర్యలకు రంగం సిద్దం.. అసెంబ్లీ సమావేశాల్లో మైక్ కట్..!

TTD Prasadam: శ్రీవారి ప్రసాదానికి నాసిరకం జీడిపప్పు సరఫరా?.. విషయం బహిర్గతం అవడంతో..

EPFO Subscribers: ఈపీఎఫ్‌వోలో 14.65 లక్షల మంది సభ్యుల చేరిక.. వివరాలు వెల్లడించిన సంస్థ