సాయంత్రం అయితే ఫోన్‌లు, టీవీలు పక్కన పెట్టాల్సిందే.. ఆ గ్రామ సర్పంచ్‌ వినూత్న నిర్ణయం..

|

Oct 08, 2022 | 7:23 AM

ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది. టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లు ప్రతీ మనిషి జీవితంలో ఒక భాగమైపోయాయి. ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ లేకపోతే రోజు గడవని పరిస్థితి వచ్చింది. ఉదయం లేచింది మొదలు, రాత్రి పడుకునే వరకు ఫోన్‌లు, గ్యాడ్జెట్స్‌తోనే గడిపేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌ల కారణంతో...

సాయంత్రం అయితే ఫోన్‌లు, టీవీలు పక్కన పెట్టాల్సిందే.. ఆ గ్రామ సర్పంచ్‌ వినూత్న నిర్ణయం..
Digital Detox
Follow us on

ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది. టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లు ప్రతీ మనిషి జీవితంలో ఒక భాగమైపోయాయి. ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ లేకపోతే రోజు గడవని పరిస్థితి వచ్చింది. ఉదయం లేచింది మొదలు, రాత్రి పడుకునే వరకు ఫోన్‌లు, గ్యాడ్జెట్స్‌తోనే గడిపేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌ల కారణంతో పిల్లలు చదువులపై ఏకగ్రాత పెట్టడం లేదు, మహిళలు ఇంటి పనులను నిర్లక్ష్యం చేస్తున్నారు. అందరూ ఇలాగే చేస్తున్నారంటే మెజారిటీ మాత్రం ఇంతేనని చెప్పొచ్చు. అయితే ఇలాంటి సమస్యకు చెక్‌ పెట్టడానికే ఓ గ్రామ సర్పంచ్‌ వినూత్న నిర్ణయం తీసుకున్నారు.

తమ గ్రామంలో ఉన్న ప్రజలు డిజిటిల్‌ గ్యాడ్జెట్లకు కాసేపైనా దూరంగా ఉండేలా కఠిన నిబంధనలను అమలు చేశారు. రాత్రి 7 గంటల నుంచి గంటన్నర సేపు ప్రజలంతా స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లా కాడేగావ్‌ మండలం మోహిత్యాంచె వడ్గావ్‌ గ్రామంలో ఈ నిబంధన అమల్లో ఉంది. ఇంతకీ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటంటే. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఆన్‌లైన్‌ క్లాసులు వినడానికి గ్రామంలో ఉన్న విద్యార్థులకు పేరెంట్స్‌ స్మార్ట్‌ఫోన్‌లు కొనిచ్చారు. దీంతో పిల్లలు చదువును నిర్లక్ష్యం చేస్తూ ఆ ఫోన్‌లతోనే గంటలకొద్ది గడపడం ప్రారంభించారు. ఇక ఇంట్లో మహిళలు సైతం టీవీలకు అతుక్కుపోయారు.

దీనంతటినీ గమనించిన గ్రామ సర్పంచ్‌ విజయ్‌ మోహిత్‌ విద్యార్థుల భవిష్యుత్తును దృష్టిలో పెట్టుకొని ఈ కఠిన నిర్ణయాన్ని అమలు చేయాలని డిసైడ్‌ అయ్యారు. ఆగస్టు 15వ తేదీన గ్రామంలోని మహిళలతో సమావేశమై రోజూ రాత్రి 7 నుంచి 8.30 మధ్య టీవీలు, సెల్‌ఫోన్లు పూర్తిగా ఆఫ్‌ చేయాలని తీర్మానించారు. మరి ఇంట్లో ఉన్న వాళ్లు ఫోన్‌లకు, టీవీలకు దూరంగా ఉన్నారనే విషయం ఎలా తెలుస్తుందనేగా.. ఈ బాధ్యతను ప్రభుత్వ ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, పంచాయతీ సభ్యులకు అప్పగించారు. రాత్రి 7 కాగానే సైరన్‌ మోగిన వెంటనే ఫోన్‌లు, టీవీలను పక్కన పెట్టేసి తమ తమ పనులు చేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..