భూ మండలంపై ఎన్నో రకాల జంతువులు నివసిస్తున్నాయి. కంటికి కనిపించని సూక్ష్మజీవుల నుంచి అత్యంత పెద్దవైన బ్లూ వేల్స్ వరకు జీవిస్తున్నాయి. వాటి మనగడ కోసం అవి నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాయి. ఆ పోరాటంతో బలమైనవే పై చేయి సాధిస్తాయి. బలహీనమైనవి ప్రాణాలు కోల్పోతుంటారు. నిత్యం ఉత్కంఠతో నిండిపోయిన ఈ ప్రకృతిలో ప్రమాదకర, భయంకరమైన జంతువులు ఎన్నో ఉన్నాయి. అవి ఇతర జంతువులకే కాకుండా మనుషులకూ ప్రమాదకరమైనవి. ఒకప్పుడు భూమిపై డైనోసార్లు నివాసమున్నాయన్న విషయం తెలిసిందే. అవి తమ ఆహారాన్ని నేరగా మింగేస్తూ హాం ఫట్ అనిపిస్తాయి. ఆయితే ప్రస్తుతం వాటి ఉనికి లేనప్పటికీ అలాంటి ప్రమాదకర జంతువులు ఎక్కడో ఓ చోట ఉనికిని చాటుకుంటూనే ఉన్నాయి. అవి మేక, జింక, కోతి వంటి జంతువులనూ నేరుగా మింగేస్తాయి. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో రాక్షస బల్లిని పోలిన జంతువు ఓ కోతిని నేరుగా మింగేసింది.
ఇవి కూడా చదవండి— The Dark Side Of Nature (@TheDarkNatur3) August 27, 2022
కొమోడో డ్రాగన్ అనే బల్లి జాతికి చెందిన జీవి.. చాలా ప్రమాదకరమైనవి. వీటి విషం బాధితుడి శరీరంలోకి ప్రవేశించిన వెంటనే అతను ప్రాణాలు కోల్పోతాడు. అయితే.. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఆ జీవి ఓ కోతిని మింగేయడాన్ని చూడవచ్చు. ఈ దృశ్యం అచ్చం సినిమాల్లో చూపించిన విధంగా ఉంది. ఈ క్లిప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోకు ఇప్పటి వరకు వేలల్లో వ్యూస్ వచ్చాయి. వందలాది మంది ఈ వీడియోను లైక్ చేసి రకరకాల కామెంట్లు చేస్తున్నారు.