Watch Video: వేగంగా దూసుకొచ్చిన రెండు కార్లు.. కట్‌చేస్తే.. రోడ్డుపై పల్టీలు.. తప్పు.. ఎవరిదంటారు?

తరచుగా సోషల్ మీడియాలో రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు వైరల్‌ అవుతూ ఉంటాయి. అందులో ప్రమాదానికి గురైన వాహనాల్లో ప్రయాణిస్తున్న వ్యక్తులు ఎలాంటి గాయాలు కాకుండా బయటపడి మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటారు. తాజాగా ఆలాంటి ఒక ప్రమాదానికి సంబంధించిన వీడియోనే ప్రస్తుతం ట్రెడింగ్‌లోకి వచ్చింది. ఇంతకు ఆ వీడియో ఏంటో చూద్దాం పదండి.

Watch Video: వేగంగా దూసుకొచ్చిన రెండు కార్లు.. కట్‌చేస్తే.. రోడ్డుపై పల్టీలు.. తప్పు.. ఎవరిదంటారు?
Viral Video

Updated on: Aug 26, 2025 | 9:06 PM

తరచుగా సోషల్ మీడియాలో రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు వైరల్‌ అవుతూ ఉంటాయి. అందులో ప్రమాదానికి గురైన వాహనాల్లో ప్రయాణిస్తున్న వ్యక్తులు ఎలాంటి గాయాలు కాకుండా బయటపడి మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటారు. తాజాగా ఆలాంటి ఒక ప్రమాదానికి సంబంధించిన వీడియోనే ప్రస్తుతం ట్రెడింగ్‌లోకి వచ్చింది. ఈ వీడియో ప్రకారం ఒక కూడలి వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక కారు రోడ్డుపై నుంచి వేగంగా దూసుకొచ్చింది.. అదే సమయంలో మరో కారు ఆ రోడ్డును దాటేందుకు ప్రయత్నించింది. దీంతో వేగంగా దూసుకొస్తున్న కారు.. రోడ్డు దాటుతున్న కారును బలంగా ఢీకొట్టింది.

దీంతో ఆ కారు రోడ్డుపై రెండు మూడు పల్టీలు కొడుతూ బోల్తా పడింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే కారు వద్దకు వచ్చిన వారిని కారులోంచి బయటకు తీసే ప్రయత్నం చేశారు. ఆ కారు ఢీకొట్టిన మరో కారు నడిపిన డ్రైవర్‌ సైతం తన వాహనాన్ని పక్కకు నిలిపి బాధితుల వద్దకు వచ్చాడు. కారులో ఉన్న వ్యక్తులను బయటకు తీసి వాళ్లను వెంటనే స్థానికి హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఈ ప్రమాదంలో ఎరికీ పెద్దగా గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అంతేకాదు.. ఢీకొట్టుకున్న రెండు వాహనాలకు కూడా పెద్దగా ఎలాంటి డ్యామేజ్‌ కానట్టు కనిపిస్తోంది.

అయితే స్థానికంగా ఉన్న సీసీ టీవీ కెమెరాలో ఈ ప్రమాదానికి సంబంధిచిన దృశ్యాలు రికార్డు కావడంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్‌ చేస్తున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.