Watch: అయ్యోపాపం.. కారు ఢీకొని పెద్దపులికి తీవ్రగాయాలు.. నొప్పి భరించలేక అవస్థలు

పెద్దపులిని ఢీకొన్న కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. పొదల్లో దాక్కున్న పెద్దపులి గాయాలు తట్టుకోలేక గట్టిగట్టిగా గాండ్రించసాగింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి ఫారెస్ట్ అధికారులు, రెస్క్యూ టీం చేరుకుంది.

Watch: అయ్యోపాపం.. కారు ఢీకొని పెద్దపులికి తీవ్రగాయాలు.. నొప్పి భరించలేక అవస్థలు
A Car Collided With A Tiger

Updated on: Nov 06, 2024 | 6:43 PM

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం దారుణ ఘటన చోటు చేసుకుంది. అహోబిలం అటవీ ప్రాంతంలో హై స్పీడ్‌తో వెళ్తున్న ఓ కారు పెద్దపులిని ఢీకొంది. అహోబిలం వెళ్లే దారిలో పెద్దపులిని కారు ఢీకొనడంతో పెద్దపులి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. అడవిలో పెద్దపులి కోతుల్ని తరుముకుంటూ వెళ్తుండగా ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. కారుకు గుద్దుకున్న పెద్దపులి తీవ్రంగా గాయపడిందని, అలాగే, పొదల్లోకి వెళ్లినట్లు సాక్షులు తెలిపారు.

ఇక్కడ క్లిక్ చేయండి..

పెద్దపులిని ఢీకొన్న కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. పొదల్లో దాక్కున్న పెద్దపులి గాయాలు తట్టుకోలేక గట్టిగట్టిగా గాండ్రించసాగింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి ఫారెస్ట్ అధికారులు, రెస్క్యూ టీం చేరుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us