Illiterate: రెండో ఎక్కం కూడా రాని వీడిని పెళ్లిచేసుకోను..పీటల మీద పెళ్లి ఆపేసిన వధువు..వరుడికి షాక్!

|

May 04, 2021 | 10:46 AM

Bride refuse to marry Illiterate: భారతదేశంలో పెళ్లి అంటే.. వరుడి కోర్కెలు.. వరుడి బంధువుల గొంతెమ్మ కోర్కెలు తీర్చడమే. పెళ్ళికొడుకు ఎలా చెబితే అలా పెళ్లి జరుగుతుంది. ఇక పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఆలోచనలతో సంబంధం లేదు.

Illiterate: రెండో ఎక్కం కూడా రాని వీడిని పెళ్లిచేసుకోను..పీటల మీద పెళ్లి ఆపేసిన వధువు..వరుడికి షాక్!
Bride Refuse To Marry Illiterate
Follow us on

Illiterate: భారతదేశంలో పెళ్లి అంటే.. వరుడి కోర్కెలు.. వరుడి బంధువుల గొంతెమ్మ కోర్కెలు తీర్చడమే. పెళ్ళికొడుకు ఎలా చెబితే అలా పెళ్లి జరుగుతుంది. ఇక పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఆలోచనలతో సంబంధం లేదు. ఆమె చెప్పేమాట వినే పరిస్థితీ ఉండదు. ఒకవేళ పీటల మీద కూచున్నాకా పెళ్ళికొడుకు నాకు ఫలానా కావాలి అంటే ఇవ్వాల్సిందే. లేకపోతే పెళ్ళిళ్ళు ఆగిపోయి..వీధిన పడ్డ ఆడపిల్లలు ఎందరో లెక్కలు కూడా ఎవరూ చెప్పలేరు. కానీ, ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితి మారుతోంది. పెళ్లి కూతురు తనకి కావలసింది ఏమిటో కచ్చితంగా చెబుతోంది. కొన్ని చోట్ల వరుడు తనకు సరిపోడు అనిపించినపుడు నిష్కర్షగా తన అభిప్రాయం చెప్పి ఆ పెళ్లిని వదులుకోవడానికి సిద్ధం అవుతున్నారు నేటి యువతులు. వారికి అండగా కుటుంబమూ నిలబడుతోంది. ఇదిగో ఇప్పుడు మీకు చెప్పబోయే సంఘటన అటువంటి యువతికి సంబంధించిందే. నిరక్షరాస్యుడైన యువకుడిని పెళ్లి చేసుకోను అని కచ్చితంగా చెప్పి పీటల మీద పెళ్లిని ఆపు చేయించిన ఆ సంఘటన వివరాలు మీకోసం..

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన విద్యావంతురాలైన యువతికి మహోబా జిల్లాలోని ధవార్ గ్రామానికి చెందిన ఓ యువకుడితో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. శనివారం సాయంత్రం అందరూ పెళ్లి మండపానికి చేరుకోగా.. పురోహితుడు పెళ్లి తంతు మొదలు పెట్టాడు. అయితే, పురోహితుడు చెబుతున్న మంత్రాలను ఈ పెళ్ళికొడుకు తిరిగి చెప్పడంలో తడబాటు పడుతున్నాడు. ఒక్క మంత్రమూ సరిగా పలకలేక పోతున్నాడు. దీంతో వధువుకు అనుమానం వచ్చింది. పురోహితుడిని మంత్రాలు చదవడం ఆపమని కోరింది. పెళ్ళికొడుకును మీరెంత వరకూ చదివారు అంటూ ప్రశ్నించింది. దీంతో అతను నీళ్ళు నమిలాడు. వెంటనే, పెళ్ళికూతురు ఆ పెళ్ళికొడుకును రెండో ఎక్కం అప్పచెప్పమని అడిగింది. అంతే ఆయన గారి బండారం బయటపడింది.

దీంతో వధువుకు పిచ్చి కోపం వచ్చింది. నేను ఈ పెళ్లి చేసుకోను అంటూ కచ్చితంగా చెప్పి పెళ్లి మండపం నుంచి కిందకు దేగేసింది. దీంతో బంధువులు అందరూ షాక్ తిన్నారు. ఇరువైపుల పెద్దలూ ఆమెకు సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. కానీ, దానికి ఆమె ఒప్పుకోలేదు. రెండో ఎక్కం చెప్పడం రానివాడిని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అంటూ ప్రశ్నించింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమె నిర్ణయమే కరెక్ట్ అని పెళ్లిని రద్దు చేసుకున్నారు.

Also Read: Corona Positive: దేశంలోనే మొదటిసారిగా నెహ్రూ జూ పార్క్ లోని ఎనిమిది సింహాలకు కరోనా పాజిటివ్!

Vakeel Saab: వకీల్ సాబ్ సినిమా చూసి ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్నారు.. చిత్రయూనిట్ పై ఫిర్యాదు చేసిన