Viral Video: బిల్డింగ్‌పై దుమ్ము దులుపుతున్న సమయంలో అనుకోని ప్రమాదం.. నూకలు మిగిలాయి కాబట్టి బచాయించాడు..

Viral Video: అదృష్టం, ఆయుష్షు.. ఈ రెండు ఎప్పుడూ పక్కపక్కనే ఉంటాయి. వాడు అదృష్టం మాములుగా లేదురా.. తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు అనే మాటలు చాలా సార్లు వినే ఉంటాం...

Viral Video: బిల్డింగ్‌పై దుమ్ము దులుపుతున్న సమయంలో అనుకోని ప్రమాదం.. నూకలు మిగిలాయి కాబట్టి బచాయించాడు..

Updated on: Aug 04, 2022 | 6:14 PM

Viral Video: అదృష్టం, ఆయుష్షు.. ఈ రెండు ఎప్పుడూ పక్కపక్కనే ఉంటాయి. వాడు అదృష్టం మాములుగా లేదురా.. తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు అనే మాటలు చాలా సార్లు వినే ఉంటాం. అలాగే అదృష్టం కొన్నిసార్లు ఆయుష్షును కూడా పెంచుతుంది. అదృష్టం కలిసి వచ్చి ప్రాణాల నుంచి బయట పడ్డ సందర్భాలు చాలా ఉంటాయి. సోషల్‌ మీడియా ఏజ్‌లో ఇలాంటి వాటికి సంబంధించిన ఘటనలు రోజూ నెట్టింట ట్రెండ్‌ అవుతున్నాయి.

ముఖ్యంగా సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డైన వీడియోలు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. కేరళలోని మలప్పురంలో జరిగిన ఓ సంఘటన నెటిజన్లు ఆశ్చర్యంతో పాటు భయానికి గురి చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఓ కుర్రాడు బిల్డింగ్ ఫస్ట్‌ ఫ్లోర్‌ అవతల నిల్చొని దుమ్ము దులుపుతున్నాడు. అదే సమయంలో కింద అతని సోదరుడు అతన్ని గమనిస్తున్నాడు. అయితే కాలు పట్టు తప్పిందో మరెమో కానీ, పైన ఉన్న వ్యక్తి ఆకస్మాత్తుగా కింద పడిపోయాడు. దీంతో కింద ఉన్న సోదరు వెంటనే అలర్ట్‌ అయ్యాడు.. పైనుంచి పడుతోన్న వ్యక్తిని అమాంతం రెండు చేతులతో పట్టేసుకున్నాడు. దీంతో బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాడు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో..

ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయగా అది కాస్త ఇప్పుడు తెగ వైరల్‌ అవుతోంది. ఆ కుర్రాడి లక్‌ మాములుగా లేదని, ఇతను నిజంగానే చిరంజీవి అంటూ యూజర్లు కామెంట్లు చేస్తున్నారు. వీడియోను గమనిస్తే ఈ సంఘటన జులై 31న జరిగినట్లు తెలుస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

 

Loading...
Unable to load recommendations.
Follow Us