Viral Video: వావ్.. కళ్లు చెదిరేలా ఉంది భయ్యా.. సముద్రం తీరంలో డాల్ఫిన్ల గుంపు కనువిందు!

మహారాష్ట్రలోని కొంకణ్ తీరప్రాంతంలోని అద్భుత దృశ్యం పర్యాటకులను కనువిందు చేసింది. సింధుదుర్గ్ జిల్లా సమీపంలో ఉన్న లార్కర్లీ బీచ్ సమీపంలోని అరేబియా సముద్రంలో ఒకేసారి 75 డాల్ఫిన్లు గుంపూ విహరిస్తూ కనిపించింది.ఈ దృశ్యం పర్యాటలకుతో పాటు స్థానిక మత్స్యకారులను సైతం ఎంతగానో ఆకట్టుకుంది. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Viral Video: వావ్.. కళ్లు చెదిరేలా ఉంది భయ్యా.. సముద్రం తీరంలో డాల్ఫిన్ల గుంపు కనువిందు!
Konkan Coast Dolphins

Updated on: Feb 19, 2026 | 7:00 AM

సరదాగా బీచ్ చూద్దామని వెళ్లిన పర్యాటకులకు బీచ్‌కు సమీపంలోని సముద్ర తీరంలో అద్భుతమైన దృశ్యం కనువిందు చేసింది. సముద్రంలో ఒకేసారి 75 డాల్ఫిన్ల గుంపు ఈదూతూ కనిపించింది. ఈ అందమైన దృశ్యం మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిలా లార్కర్లీ బీచ్ సమీపంలో పర్యాటకులతో పాటు మత్స్యకారులను ఎంతగానో ఆకట్టుకుంది. ఒకే సారి ఒకే చోట ఇన్ని డాల్పిన్స్ కనిపించడం ఇదే ఫస్ట్‌ టైం అని స్థానిక మత్స్యకారులు, పర్యాటకులు చెబుతున్నారు.

ఈ అద్భుతమైన దృశాన్ని డ్రోన్‌ ద్వారా చిత్రీకరించిన సముద్ర జీవ శాస్త్రవేత్త విశాల్‌ భావే దానిని సోషల్‌ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో అకట్టుకుంది. దీంతో ఈ వీడియో కొన్ని నిమిషాల్లోనే సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే సింధుదుర్గ్, రత్నగిరి తీర ప్రాంతాలు డాల్ఫిన్ల ఆవాసాలుగా ఎంతో ప్రసిద్ధి చెందినవి.. ఇక్కడ తరచూ ఇలా డాల్పిన్స్, తిమింగలాలు కనిపిస్తూ ఉంటాయని స్థానికులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

ఇక్కడ తరచుగా కనిపించే డాల్ఫిన్లలో ఇండియన్ ఓషన్ హంప్‌బ్యాక్ డాల్ఫిన్, ఇండో-పసిఫిక్ ఫిన్లెస్ పోర్పోయిస్, బ్లూ వేల్, బ్రైడ్స్ వేల్, పాంట్రోపికల్ స్పాటెడ్ డాల్ఫిన్, ఇండో-పసిఫిక్ బాటిల్‌నోస్ డాల్ఫిన్, కామన్ డాల్ఫిన్, కిల్లర్ వేల్, హంప్‌బ్యాక్ వేల్, డ్వార్ఫ్ స్పెర్మ్ వేల్, ఫాల్స్ కిల్లర్ వేల్, స్ట్రిప్డ్ డాల్ఫిన్ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే సముద్రంలో డాల్ఫిన్స్ కనిపించినప్పుడు మత్యకారులు, ఇతర పర్యాటకులు వాటికి ఎలాంటి ఆటంకం కలిగించకుండా పర్యటక వ్యవస్థను కట్టుదిట్టం చేయాలని నిపుణులు అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us