Watch Video: 58 ఏళ్ల బామ్మ.. కదలకుండా ప్లాంక్‌ పొజిషన్‌లో నాలుగున్నర గంటలు.. వరల్డ్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేసింది..

|

Apr 12, 2024 | 11:29 AM

ఆ సమయంలో తన మోచేతులు తనను చాలా బాధించాయని, ఆ సమయంలో తన శరీరం పట్టుతప్పుతుందేమోనని భయపడ్డాను అని చెప్పింది డోనా. ఆ చివరి ఒక్క గంట తనకు మరింత కష్టంగా మారిందని చెప్పింది. అప్పుడు తన దృష్టి అంతా తన శరీరం, తను చేస్తున్న ఆసనంపైనే ఉంచానని గిన్నిస్ బుక్‌ వారికి చెప్పింది డోనా. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Watch Video: 58 ఏళ్ల బామ్మ.. కదలకుండా ప్లాంక్‌ పొజిషన్‌లో నాలుగున్నర గంటలు.. వరల్డ్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేసింది..
58 Year Old Woman Doing Plank
Follow us on

58 ఏళ్ల బామ్మ ..అరుదైన రికార్డు క్రియేట్‌ చేసింది. వయస్సు కేవలం సంఖ్య మాత్రమే అని ప్రపంచానికి నిరూపించింది. కెనడాకు చెందిన 58 ఏళ్ల మహిళ నాలుగున్నర గంటల పాటు ఒకే ఎక్సర్‌సైజ్‌ యాంగిల్‌ ఉండి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరును నమోదు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో గిన్నిస్ బుక్ అధికారిక సోషల్ మీడియా ఖాతా నుంచి షేర్ చేయబడింది. మరి ఈ మహిళ ఎవరో, ఎలాంటి భంగిమలో ఉందో చూద్దాం.

గిన్నిస్ బుక్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ మహిళ పేరు డోనా జీన్ వైల్డ్. ఆమె కెనడా నివాసి. మార్చి 21, 2024న డోనా నాలుగు గంటల 30 నిమిషాల 11 సెకన్ల పాటు ఉదర ప్లాంక్ ఆసనం చేయడం ద్వారా కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. డోనా చాలా సంవత్సరాలు స్కూల్‌ టీచర్‌గా పనిచేశారు.. పదవీ విరమణకు ముందు ఆమె వైస్ ప్రిన్సిపాల్‌గా కూడా పనిచేశారు. సుమారు 12 సంవత్సరాల క్రితం డోనాకు చేయి విరిగిందట. ఆ తర్వతి కాలంలో తను ప్లాంకింగ్ ప్రారంభించినట్టుగా చెప్పారు. ఒక వారం అభ్యాసంతో డోనా తన ప్లాంక్ సమయాన్ని పెంచడం మొదలుపెట్టింది. రోజూ వ్యాయామం చేస్తూ ఇలా చేయడం కంటిన్యూ చేసింది. ఇప్పుడు డోనా ప్రతిరోజూ మూడు గంటలు లేదా అంతకంటే ఎక్కువసేపు ప్లాంక్ ఆసనం చేస్తుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ సందర్భంగా ఆమె తన 12 మంది మనవరాళ్లతో సహా మొత్తం కుటుంబం ఆమెను ఉత్సాహపరిచేందుకు వచ్చారు.

ఆ సమయంలో తన మోచేతులు తనను చాలా బాధించాయని, ఆ సమయంలో తన శరీరం పట్టుతప్పుతుందేమోనని భయపడ్డాను అని చెప్పింది డోనా. ఆ చివరి ఒక్క గంట తనకు మరింత కష్టంగా మారిందని చెప్పింది. అప్పుడు తన దృష్టి అంతా తన శరీరం, తను చేస్తున్న ఆసనంపైనే ఉంచానని గిన్నిస్ బుక్‌ వారికి చెప్పింది డోనా. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సోషల్ మీడియాలో ఈ వీడియో షేర్ కావడంతో నెటిజన్లు పెద్ద సంఖ్యలో స్పందించారు. అందరూ ఆమె శక్తి సామర్థ్యాలు, సంకల్పాన్ని ప్రశంసించారు. ఆమె ప్రయత్నం అద్భుతం అంటూ చాలా మంది డోనాపై పొగడ్తల వర్షం కురిపించారు. ఈ వీడియోని Instagramలో @guinnessworldrecords ఖాతా ద్వారా షేర్‌ చేయగా, ఈ వీడియోకి ఇప్పటి వరకు 2.4 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..