2000 ఏళ్ల నాటి ప్రేమ లేఖలు.. కాల గర్భం నుండి వెలుగులోకి వచ్చిన అపురూప కావ్యాలు..

కాలం మనుషులను మింగేయగలదు, నగరాలను నాశనం చేయగలదు.. కానీ మనసులోని భావాలను మాత్రం చెరిపివేయలేదు అనడానికి ఈ ఘటనే ఒక సజీవ సాక్ష్యం. సుమారు రెండు వేల ఏళ్ల క్రితం ఒక అగ్నిపర్వతం ఉగ్రరూపం దాల్చి, రోమ్ నగర శివార్లలోని పంపేయిని నిలువునా సమాధి చేసింది. కానీ ఆ శిథిలాల కింద ఇప్పటికీ చెక్కుచెదరని కొన్ని ప్రేమ కథలు దాగి ఉన్నాయి.

2000 ఏళ్ల నాటి ప్రేమ లేఖలు.. కాల గర్భం నుండి వెలుగులోకి వచ్చిన అపురూప కావ్యాలు..
2000 Year Old Love Letters Discovered

Edited By:

Updated on: Feb 22, 2026 | 3:52 PM

నా పేరు శివమణి.. నాకు కొంచెం తిక్కుంది.. కానీ దానికి ఒక లెక్కుంది.. ఈ డైలాగ్ గుర్తుంది కదా.. అందులో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ ఒక సముద్రపు సీసాలో దొరికిన లేఖ ద్వారా తెలుస్తుంది. ఆ సీన్ చూసినప్పుడు మనందరికీ ఒక రకమైన థ్రిల్ కలిగింది. అయితే సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా కొన్ని వేల ఏళ్ల నాటి ప్రేమ కథలు కాల గర్భం నుండి బయటపడతాయని ఇటలీలోని పంపేయి నగరం నిరూపించింది. సుమారు 2000 ఏళ్ల క్రితం ఒక అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల రోమ్ సమీపంలోని పంపేయి నగరం పూర్తిగా నాశనమైంది. నగరం మొత్తం బూడిద కింద సమాధి అయిపోయింది. అయితే ఇటీవల అక్కడ జరుగుతున్న తవ్వకాల్లో ఒక అద్భుతం వెలుగు చూసింది. అప్పట్లో ఒక గల్లీ గోడలపై ప్రజలు రాసుకున్న రాతలు, వేసిన చిత్రాలను శాస్త్రవేత్తలు అధునాతన సాంకేతికతతో విశ్లేషించారు.

2000 ఏళ్ల నాటి లవ్ లెటర్స్..

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆ గోడలపై కేవలం రాతలే కాదు, ఒక మహిళ తన ప్రియుడికి రాసిన ప్రేమ సందేశాలు కూడా ఉన్నాయి. అప్పటి పితృస్వామ్య సమాజంలో కూడా ఒక స్త్రీ తన ప్రేమను ఎంత బలంగా వ్యక్తం చేసిందో ఆ శిలాశాసనాలు చెబుతున్నాయి. ప్రేమతో పాటు సమాజం వల్ల కలిగిన అవమానాలు, విరహం వంటి భావాలను కూడా ఆ గోడలపై ఆవిష్కరించారు. ఈ గోడలు క్రీస్తు శకం 230 కంటే ముందే నిర్మించినట్లు పరిశోధకులు గుర్తించారు. అంటే దాదాపు రెండు వేల ఏళ్లుగా ఆ ప్రేమ కథలు నేలమట్టంలో దాగి ఉన్నాయి.

టెక్నాలజీతో బయటపడ్డ సత్యం

గతంలో జరిగిన తవ్వకాల్లో ఈ గోడలు బయటపడినా, వాటిపై ఉన్న మసకబారిన రాతల అర్థం ఎవరికీ అర్థం కాలేదు. కానీ ఇప్పుడు లేటెస్ట్ డిజిటల్ స్కానింగ్, అలిటికల్ టూల్స్ సహాయంతో ఆ కాలపు మనుషుల మనోభావాలను శాస్త్రవేత్తలు డీకోడ్ చేయగలిగారు. నగరంలోని ప్రధాన రహదారికి వెళ్లే ఒక సందులో ఉన్న ఈ గోడలపై రాతలు చూస్తుంటే.. అప్పట్లో ప్రేమికులు తమ భావాలను పంచుకోవడానికి ఇలాంటి రహస్య ప్రదేశాలను ఎంచుకునేవారని అర్థమవుతోంది. ఈ విషయం తెలిసిన నేటి తరం కుర్రకారు ప్రేమ ఎక్కడున్నా, ఎన్ని ఏళ్లయినా దాస్తే దాగుతుందా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. శివమణి సినిమాలో లేఖ సముద్రం నుండి వస్తే, ఈ పంపేయి ప్రేమ కథలు భూమి పొరల నుండి బయటపడ్డాయి. కాలం మారినా, భాష మారినా.. ప్రేమించే మనసు, ఆ భావం మాత్రం రెండు వేల ఏళ్ల క్రితమైనా, ఇప్పుడైనా ఒక్కటేనని ఈ ఘటన నిరూపిస్తోంది!

Follow Us