Viral: జన్‌ధన్ ఖాతాలో రూ.15 లక్షలు.. ఉబ్బితబ్బిబై రూ.9 లక్షలతో ఇల్లు కట్టేశాడు.. చివర్లో దిమ్మతిరిగే షాక్!

|

Feb 09, 2022 | 10:00 PM

అతడో పేద రైతు.. రోజూవారీ కూలీతోనే తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. కొంతకాలం క్రితం తన అకౌంట్ నుంచి డబ్బును తీసుకునేందుకు..

Viral: జన్‌ధన్ ఖాతాలో రూ.15 లక్షలు.. ఉబ్బితబ్బిబై రూ.9 లక్షలతో ఇల్లు కట్టేశాడు.. చివర్లో దిమ్మతిరిగే షాక్!
Farmer
Follow us on

అతడో పేద రైతు.. రోజూవారీ కూలీతోనే తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. కొంతకాలం క్రితం తన అకౌంట్ నుంచి డబ్బును తీసుకునేందుకు బ్యాంకు వెళ్లాడు. అనంతరం బ్యాలెన్స్ చెక్ చేయగా.. అందులో రూ. 15 లక్షలు ఉండటం చూసి షాక్‌కు గురయ్యాడు. ఉబ్బితబ్బిబై రూ. 9 లక్షలతో ఓ అందమైన ఇల్లు కట్టుకున్నాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. అసలు కథ మాత్రం ఇప్పుడు మొదలైంది. ఆ డబ్బు మొత్తం తమదేనని.. తిరిగి చెల్లించాలంటూ ఆ రైతుకు ఓ లేఖ అందింది. దీనితో అతడికి దిమ్మతిరిగిపోయింది. ఏం చెయ్యాలో తెలియక చివరికి తల పట్టుకున్నాడు. ఈ స్టోరీ జాతీయ మీడియా వెబ్‌సైట్(Lokmat)లో ప్రచురితమైంది. అసలు ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం..

వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా దావర్‌వాడీ గ్రామానికి చెందిన ధ్యానేశ్వర్ జనార్ధన్ ఔటే అనే రైతు తన ఖాతాలో బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకున్నాడు. అందులో ఏకంగా రూ. 15 లక్షలు ఉండటం చూసిన అతడు ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఈ డబ్బంతా కూడా మోడీనే వేశారని ఉబ్బితబ్బైపోయాడు. వెంటనే ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలుపుతూ మెయిల్ కూడా పంపాడు. ఇక తన ఖాతాలో నుంచి రూ. 9 లక్షలు తీసుకుని.. తన గ్రామంలో చక్కటి ఇల్లు నిర్మించుకున్నాడు. అంతా హ్యాపీనె అనుకున్న అతడికి ఫ్యూజులు ఎగిరిపోయేలా ఓ లేఖ వచ్చి పడింది. ఆ లేఖ స్థానిక గ్రామ పంచాయితీ నుంచి వచ్చింది. దాని సారాంశం.. ‘జిల్లా పరిషత్ నుంచి పింపల్‌వాడీ గ్రామ పంచాయితీకి రావాల్సిన నిధులు పొరపాటున మీ అకౌంట్‌లో జమ అయ్యాయి. దాన్ని తిరిగి చెల్లించాల్సిందిగా కోరుకుంటున్నాం’ అని పేర్కొన్నారు. ఖాతాలో మిగిలి ఉన్న రూ. 6 లక్షలు ధ్యానేశ్వర్ తిరిగి ఇచ్చేశాడు గానీ.. మిగిలిన రూ. 9 లక్షలు ఎలా ఇవ్వాలో తెలియక తల పట్టుకున్నాడు.