చైనా ‘బూచి’….లండన్ చెక్కేస్తున్న టిక్ టాక్ ?

చైనా ప్రభుత్వం నుంచి తనకు ఏదైనా 'ముప్పు' పొంచి ఉండవచ్చునన్న భయంతో టిక్ టాక్ మెల్లగా తన ప్రధాన కార్యాలయాన్ని మరో చోటికి మార్చుకోవాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో కొన్ని నెలలుగా తమ హెడ్ క్వార్దర్స్ ని లండన్ కి తరలించేందుకు..

చైనా 'బూచి'....లండన్ చెక్కేస్తున్న టిక్ టాక్ ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 19, 2020 | 4:22 PM

చైనా ప్రభుత్వం నుంచి తనకు ఏదైనా ‘ముప్పు’ పొంచి ఉండవచ్చునన్న భయంతో టిక్ టాక్ మెల్లగా తన ప్రధాన కార్యాలయాన్ని మరో చోటికి మార్చుకోవాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో కొన్ని నెలలుగా తమ హెడ్ క్వార్దర్స్ ని లండన్ కి తరలించేందుకు బ్రిటన్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోందట. చైనాలో దీని మాతృక సంస్థ ‘బైట్ డాన్స్…అయితే ఈ సంస్థకు దూరం కావాలనుకుంటోందని తెలిసింది. ఇదే సమయంలో ఇతర లొకేషన్స్ ని కూడా పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ ఏడాది కాలిఫోర్నియాలో ఓ భవనాన్ని అద్దెకు తీసుకున్నప్పటికీ టిక్ టాక్ ‘కళ్లన్నీ’ లండన్ మీదే ఉన్నాయట. అమెరికాలో ఈ సంస్ధపై  గట్టి నిఘా ఉంది. దీనిపై అమెరికా ప్రభుత్వానికి అనుమానాలు పెరిగిపోతున్నాయి. యూజర్ డేటాను మార్చివేయాలని చైనా దీనిపై ఒత్తిడి పెంచుతోందని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. ఏమైనా….. రానున్న సంవత్సరాల్లో చైనా బయటే తన కార్యకలాపాలను కొనసాగించాలని టిక్ టాక్ గట్టి నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది.

భారత ప్రభుత్వం మాదిరే దీన్ని తాము కూడా నిషేధించాలని యోచిస్తున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఇటీవల వెల్లడించారు.