కోరెగావ్ భీమా పిల్లర్ వద్ద భారీ బందోబస్తు.. అజిత్ పవార్ నివాళులు

పూణేసమీపంలోని కోరెగావ్ భీమా గ్రామంలోని ‘ జై ‘ (విజయ) సంభం ‘ వద్ద మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్, వంచిత్ బహుజన్ అఘాడీ అధ్యక్షుడు ప్రకాష్ అంబెడ్కర్ తదితరులు బుధవారం ఘనంగా నివాళులు అర్పించారు. ‘ కోరెగావ్ భీమా పోరాటం ‘ జరిగి 202 సంవత్సరాలు అయిన సందర్భంగా వీరంతా ఈ ఉదయం ఈ పిల్లర్ వద్దకు చేరుకున్నారు. ఈ గ్రామంలో 1818 జనవరి 1 న మహారాష్ట్ర పేష్వాలకు, బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీకి […]

కోరెగావ్ భీమా పిల్లర్ వద్ద భారీ బందోబస్తు.. అజిత్ పవార్ నివాళులు
Follow us

|

Updated on: Jan 01, 2020 | 1:09 PM

పూణేసమీపంలోని కోరెగావ్ భీమా గ్రామంలోని ‘ జై ‘ (విజయ) సంభం ‘ వద్ద మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్, వంచిత్ బహుజన్ అఘాడీ అధ్యక్షుడు ప్రకాష్ అంబెడ్కర్ తదితరులు బుధవారం ఘనంగా నివాళులు అర్పించారు. ‘ కోరెగావ్ భీమా పోరాటం ‘ జరిగి 202 సంవత్సరాలు అయిన సందర్భంగా వీరంతా ఈ ఉదయం ఈ పిల్లర్ వద్దకు చేరుకున్నారు. ఈ గ్రామంలో 1818 జనవరి 1 న మహారాష్ట్ర పేష్వాలకు, బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీకి మధ్య పోరాటం జరిగిన విషయం గమనార్హం. నాటి పోరాటంలో 22 మంది బ్రిటిష్ సైనికులు మరణించగా.. బ్రిటన్ నుంచి మరింతమంది సైనిక బలగాలు తరలి రావచ్చునని భయపడిన పేష్వాలు చివరకు లొంగిపోయారు. అగ్రవర్ణ పేష్వాల అణచివేతను సహించలేని ఈ గ్రామ ‘ మహర్ ‘ కులస్థులు (దళితులు) ప్రతియేటా జనవరి 1 న ఇది తాము సాధించిన విజయంగానే భావించి ఇక్కడ ఓ ‘ విజయ స్తంభాన్ని ‘ నిర్మించుకున్నారు. కాగా- 2018 జనవరి 1 న ఇక్కడ ఆ పోరాటానికి సంబంధించి ద్విశతాబ్ధ ఉత్సవాల సందర్భంగా జరిగిన ఘర్షణల్లో ఒకరు మరణించగా.. పలువురు గాయపడ్డారు. అయితే ఈ సారి అలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. ఈ పిల్లర్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడిన అజిత్ పవార్.. ఈ విజయ స్తంభానికి ఎంతో చరిత్ర ఉందని, ప్రతి ఏడాదీ లక్షల మంది ఇక్కడికి వస్తుంటారని చెప్పారు. రెండేళ్ల క్రితం ఇక్కడ కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగాయని, కానీ అలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం ఈ సారి అన్ని చర్యలూ తీసుకుందని ఆయన వెల్లడించారు. రెండు సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో జరిగిన హింసకు బాధ్యులైన వారికందరికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. డిసెంబరు 29 నుంచి నాలుగు రోజులపాటు ఈ గ్రామంలో అడుగుపెట్టరాదని వారిని హెచ్చరించారు.

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..