ప్రపంచంలో కరోనా ఉధృతి.. ఈ మూడు దేశాల్లోనే అధికం

ప్రపంచంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్నింటా తన ప్రభావాన్ని చూపుతోంది. రోజుకు 3 లక్షల మంది వరకు కరోనా వైరస్‌ బారిన పడుతున్నారు. రాకాసి వైరస్ ను అంతమొందించేందుకు ప్రపంచ దేశాలన్ని విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. మాయదారి రోగాన్ని నివారించేందుకు ప్రపంచ దేశాలన్నీ వ్యాక్సీన్ ప్రయోగాలు చేస్తున్నాయి

ప్రపంచంలో కరోనా ఉధృతి.. ఈ మూడు దేశాల్లోనే అధికం
Follow us

|

Updated on: Aug 30, 2020 | 6:20 PM

ప్రపంచంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్నింటా తన ప్రభావాన్ని చూపుతోంది. రోజుకు 3 లక్షల మంది వరకు కరోనా వైరస్‌ బారిన పడుతున్నారు. రాకాసి వైరస్ ను అంతమొందించేందుకు ప్రపంచ దేశాలన్ని విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. మాయదారి రోగాన్ని నివారించేందుకు ప్రపంచ దేశాలన్నీ వ్యాక్సీన్ ప్రయోగాలు చేస్తున్నాయి. ఇప్పటి వరకు అగ్రరాజ్యం అమెరికా, బ్రెజిల్, భారత్ ఈ మూడు దేశాల్లో అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 2.5కోట్ల మందికి కరోనా పాజిటివ్ నమోదవగా.. వీటిలో 53శాతంపైగా ఈ మూడు దేశాల్లోనే వెలుగుచూస్తున్నాయి.

అత్యధికంగా అమెరికాలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక్కడ ఇప్పటివరకు 59లక్షల మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇక ప్రపంచంలోనే అత్యధిక కేసులతో రెండో స్థానంలో కొనసాగుతున్న బ్రెజిల్‌లో 38 లక్షల మంది కరోనా బాధితులు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక, మన భారత్‌ కరోనా కేసుల నమోదులో ప్రపంచంలో మూడో స్థానంలో కొనసాగుతుంది. ఇప్పటివరకు భారత దేశ వ్యాప్తంగా 35 లక్షల మందికిపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 8,47,778మంది కరోనా మహమ్మారికి బలయ్యారని అమెరికాకు చెందిన జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీకి చెందిన కరోనా ట్రాకర్ వెల్లడించింది.

అటు కరోనాను ఉగ్రరూపానికి అమాయకులు బలవుతున్నారు. మందు లేని మాయదారి రోగానికి విలవిలలాడుతున్నారు. వ్యాక్సిన్ వస్తే తప్ప కట్టడి పడదని ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు వ్యాక్సిన్ కోసం త్వరలోనే అందుబాటులోకి వస్తుందని భారత్ తో సహా పలు అగ్రదేశాలు భరోసా ఇస్తున్నాయి. ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుని త్వరలోనే మార్కెట్ లోకి రానున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు