అందులో తప్పేముంది.. ఐష్‌పై చేసిన ట్వీట్‌కు స్పందించిన వివేక్

వివేక్‌ ఒబెరాయ్‌ నటి ఐశ్వర్య రాయ్‌ను ఎగ్జిట్‌ పోల్స్‌తో పోల్చుతూ చేసిన ట్వీట్‌ వివాదాస్పదంగా మారింది. అయితే ఎట్టకేలకు ట్వీట్‌పై వివేక్ ఒబెరాయ్ స్పందించాడు. ఆ పోస్ట్‌లో తప్పేముందని అన్నాడు. అందరూ క్షమాపణలు చెప్పాలని కామెంట్స్ చేస్తున్నారని… నేను పోస్ట్ చేసిన దాంట్లో నాకు తప్పేమి కనిపించడం లేదంటూ విమర్శలను కొట్టిపారేశారు. అయితే జాతీయ మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చిందని ఓ జాతీయ మీడియా సంస్థ ప్రశ్నించగా.. తనకు ఇంకా నోటీసులు అందలేదని.. అందిన తర్వాత కమిషన్ […]

అందులో తప్పేముంది.. ఐష్‌పై చేసిన ట్వీట్‌కు స్పందించిన వివేక్
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: May 30, 2019 | 6:14 PM

వివేక్‌ ఒబెరాయ్‌ నటి ఐశ్వర్య రాయ్‌ను ఎగ్జిట్‌ పోల్స్‌తో పోల్చుతూ చేసిన ట్వీట్‌ వివాదాస్పదంగా మారింది. అయితే ఎట్టకేలకు ట్వీట్‌పై వివేక్ ఒబెరాయ్ స్పందించాడు. ఆ పోస్ట్‌లో తప్పేముందని అన్నాడు. అందరూ క్షమాపణలు చెప్పాలని కామెంట్స్ చేస్తున్నారని… నేను పోస్ట్ చేసిన దాంట్లో నాకు తప్పేమి కనిపించడం లేదంటూ విమర్శలను కొట్టిపారేశారు. అయితే జాతీయ మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చిందని ఓ జాతీయ మీడియా సంస్థ ప్రశ్నించగా.. తనకు ఇంకా నోటీసులు అందలేదని.. అందిన తర్వాత కమిషన్ దగ్గరకి వెళ్లి తన అభిప్రాయాన్ని వెల్లడిస్తానని అన్నారు.

మరోవైపు ఈ ట్వీట్‌ను డిలీట్‌ చేయాలని ప్రముఖ దర్శకుడు మధుర బండార్కర్‌ కోరారు. వివేక్ తీరుపై ఇప్పటికే నటి సోనమ్‌ కపూర్‌, క్రీడాకారిణి గుత్తా జ్వాలాతోపాటు పలువురు ప్రముఖులు మండిపడ్డారు. తాజాగా దర్శకుడు మధుర బండార్కర్‌ స్పందించారు. ప్రియమైన వివేక్‌ ఒబెరాయ్‌.. నీ నుంచి ఇలాంటి ట్వీట్‌ను ఎప్పుడూ ఊహించలేదు. విమర్శకులు ఎంతకైనా తెగించి, ఎలాంటి మీమ్స్‌ అయినా చేస్తారు. కానీ బాధ్యతగల ఓ సెలబ్రిటీ అయిన మీరు మరొకరి మనోభావాలు దెబ్బతినకుండా ప్రవర్తించాలి. దయచేసి క్షమించమని కోరి, ట్వీట్‌ను డిలీట్‌ చేయండంటూ ట్వీట్‌ చేశారు. అయితే ఈ విమర్శలపై వివేక్‌ ఇంకా స్పందించలేదు.

అయితే సోనమ్ కపూర్‌ వ్యాఖ్యలపై స్పందించిన వివేక్… సినిమాల్లోనూ, సోషల్ మీడియాలోనూ కాస్త ఓవర్ యాక్షన్ తగ్గించుకోవాలని చురకలు వేశాడు. అంతేకాదు.. తాను మహిళా సాధికారత కోసం పదేళ్ల నుంచి కృషి చేస్తున్నానని… నా ఈ ట్వీట్ ఎవరి మనోభావాలను గాయపరచేలేదనే అనుకుంటున్నానని అన్నాడు.