Breaking News
  • భారత్‌-అమెరికా సంబంధాలు మరింత బలపడుతున్నాయి. కరోనాపై పోరులో భారత్‌ చేయాల్సిందంతా చేస్తోంది. సాయం చేయడానికి భారత్‌ ఎప్పుడూ ముందుంటుంది. కరోనా వైరస్‌ను కలిసికట్టుగా ఎదుర్కొంటాం-ప్రధాని మోదీ.
  • ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రశంసలు. కరోనాపై యుద్ధంలో భారతీయుల కృషి అభినందనీయం. భారత ప్రధాని మోదీకి నా ధన్యవాదాలు-ట్రంప్‌ ట్వీట్‌.
  • కృష్ణాజిల్లా: మచిలీపట్నంలో గుండెపోటుతో వ్యక్తి మృతి. ఇటీవల కరోనాతో చనిపోయిన వ్యక్తికి సోదరుడు కావడంతో.. స్థానికుల్లో పలు అనుమానాలు. మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలింపు. శాంపిల్స్‌ పరీక్షించే వరకు మృతదేహం ఇవ్వమంటున్న అధికారులు.
  • తెలంగాణలో డయల్‌ 100కు పెరుగుతున్న కాల్స్‌. లాక్‌డౌన్‌ తర్వాత డయల్‌ 100కు 13,34,330 కాల్స్‌. ఎమర్జెన్సీ కాల్స్‌-82,014. కోవిడ్‌ సస్పెక్ట్ కాల్స్‌- 2,710. లాక్‌డౌన్‌ కాల్స్‌-21,758. ఇన్‌ ఎఫెక్టివ్‌ కాల్స్‌-87,665. విచారణ కోసం చేసిన కాల్స్‌- 84,123. తగ్గిన చోరీలు, గృహ హింస, రోడ్డుప్రమాదాల కాల్స్‌.
  • తెలంగాణలో క్రైమ్‌ రేట్‌ తగ్గింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో క్రైమ్‌రేట్‌ భారీగా పడిపోయింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో క్రైమ్‌రేటు 56 శాతానికి పడిపోవడం ఊరటనిస్తోంది. లాక్‌డౌన్‌తో దొంగతనాలు పూర్తిగా తగ్గిపోయాయి.

అతని సంపాదన.. ఒక గంటలో 16 వేల కోట్లు..!

Tesla chief Elon Musk adds billion dollors to his fortune in just one hour, అతని సంపాదన.. ఒక గంటలో 16 వేల కోట్లు..!

స్పేస్ ఎక్స్ సీఈవో ఎలన్‌ మస్క్‌ సంపాదన ఒక్క గంటలోనే దాదాపు 2.3 బిలియన్‌ డాలర్లు(రూ.16 వేల కోట్లకు పైగా) పెరిగిపోయింది. టెస్లా షేర్లు మార్కెట్లో బలంగా ట్రేడవుతున్నాయి. అంచనాల కంటే నాలుగో త్రైమాసిక ఫలితాలు ఆకర్షణీయంగా ఉంటాయనే అంచనాలు.. మోడల్‌ వై క్రాసోవర్‌ కారు తయారీ వేగవంతం చేయడం వంటి కారణాలతో నిన్న వాల్‌స్ట్రీట్‌లో ఈ షేర్లు పరుగులు తీశాయి. 580.99 డాలర్లు వద్ద ఈ షేరు ట్రేడింగ్‌ ముగించింది. ఒక దశలో 12శాతం పెరిగి 649 వద్దకు చేరింది. ఈ కంపెనీ సీఈవో ఎలన్‌ మస్క్‌ సంపద దీంతో 36బిలియన్‌ డాలర్లుగా బ్లూమ్‌బెర్గ్‌ అంచనా కట్టింది.

కాగా.. స్పేస్ ఎక్స్ సీఈవో ఎలన్‌ మస్క్‌ వద్ద టెస్లాలో ఐదోవంతు షేర్లు ఉన్నాయి. ఇక స్పేస్‌ ఎక్సోప్లోరేషన్‌ టెక్నాలజీస్‌ కార్పొరేషన్‌లో 14.6 బిలియన్‌ డాలర్ల షేర్లు ఉన్నాయి. కొన్నాళ్ల కిందటే టెస్లా మార్కెట్‌ విలువ 100 బిలియన్‌ డాలర్లను దాటేసింది. దీనిని మస్క్‌ నిలబెట్టుకోగలిగితే ఆయన సంపద భారీగా పెరుగుతుంది. ఈ క్రమంలో మస్క్‌కు 346 మిలియన్‌ డాలర్లు అందనున్నాయి. టెస్లా మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటిచినప్పటి నుంచి కంపెనీ షేర్లు దాదాపు రెట్టింపైయ్యాయి. చైనాలో మోడల్‌ వై తయారీ కోసం త్వరలో ప్లాంట్‌ను ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకొన్నాయి. కంపెనీ 2025 నాటికి రెండు నుంచి మూడు మిలియన్ల వాహనాలు విక్రయించనుందని అంచనాలు ఉన్నాయి.

Related Tags