Telangana Crime: ప్రేమించానని నమ్మించాడు.. ప్రతిఘటించిందని నిప్పంటించాడు.. ఆపై..

పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఐదు రోజుల క్రితం ఇంటి నుంచి తీసుకెళ్లాడు. తాళి కడతానని చెప్పి, ముళ్ల పొదల్లోకి లాక్కెళ్లాడు. అత్యాచారం(Rape Attempt) చేసేందుకు ప్రయత్నించగా బాధితురాలు...

Telangana Crime: ప్రేమించానని నమ్మించాడు.. ప్రతిఘటించిందని నిప్పంటించాడు.. ఆపై..
Young Woman Murder

Updated on: Feb 20, 2022 | 10:09 AM

పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఐదు రోజుల క్రితం ఇంటి నుంచి తీసుకెళ్లాడు. తాళి కడతానని చెప్పి, ముళ్ల పొదల్లోకి లాక్కెళ్లాడు. అత్యాచారం(Rape Attempt) చేసేందుకు ప్రయత్నించగా బాధితురాలు ప్రతిఘటించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురై యువతి చీరకు నిప్పంటించాడు. మంటలు తాళలేక యువతి కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. వెంటనే మంటలు ఆర్పి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం మరో హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ దివ్యాంగ యువతి మృతి చెందింది. తెలంగాణ(Telangana) లోని నారాయణపేట జిల్లా మద్దూరు మండలం తిమ్మారెడ్డిపల్లికి చెందిన గొల్ల కృష్ణవేణి దివ్యాంగురాలు. ఆమె తల్లి చనిపోగా తండ్రి గోవిందు రెండో పెళ్లి చేసుకున్నాడు. దీంతో కుటుంబసభ్యులు హైదరాబాద్‌లో నివాసముంటూ.. రోజూ వారీ కూలీ పనులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ నెల 13న కృష్ణవేణి అదృశ్యమైంది. ఆమె కోసం కుటుంబసభ్యులు వెతికినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో రాజేంద్రనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరోవైపు శుక్రవారం సాయంత్రం మద్దూరు ప్రభుత్వ ఆసుపత్రి వెనుక ముళ్లపొదల్లో కృష్ణవేణి ఒంటికి నిప్పంటుకొని కేకలు వేయగా స్థానికులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమై 108 వాహనంలో నారాయణపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడా చికిత్స పొందుతూ శనివారం ఉదయం కృష్ణవేణి మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. యువతి మృతికి కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిందితుడి ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ వస్తోందని, త్వరలోనే అతడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. వెంకట్‌రాముడికి భార్య, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు.

Also Read

Babu Gogineni: ఏ పార్టీకి మద్దతు లేదు.. సోషల్ మీడియాలో ప్రచారంపై బాబు గోగినేని క్లారిటీ..

ఆకలి తీర్చుకోవడానికి మేక అద్భుతమైన ఐడియా !! వీడియో మతి పోతుంది !!

Harley Davidson: హార్లే డేవిడ్సన్‌ నుంచి అద్భుతమైన ఎలక్ట్రిక్‌ బైక్‌.. యారో ఆర్కిటెక్చర్‌ టెక్నాలజీతో..