భార్య భర్తల మధ్య విభేదాలు రావడం సహజం. కొన్ని గొడవలు వాటంతటవే సర్దుమణుగుతాయి. మరికొన్ని పంచాయితీల వరకు వెళ్తుంటాయి. ఇంకొన్ని విడాకులు లేకుంటే కిడ్నలు,హత్యలకు కూడా దారితీస్తుంటాయి. ఇలాంటి వార్తలు మనం నిత్యం చూస్తుంటాం. తాజాగా ఓ తల్లి భర్త గొడవ పడి కన్నకొడుకుని నడి రోడ్డు పై వదిలేసి వెళ్ళింది. అభంశుభం తెలియని ఆ చిన్నారి అమ్మానాన్న కనిపించక రోడ్డు పై తిరుగుతూ పోలీసులకు కనిపించాడు.
వివరాల్లోకి వెళ్తే కుందుకూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం, ఆరుట్ల గ్రామానికి చెందిన రాధికకు కేశంపేట మండలం, సంతపూరు గ్రామానికి చెందిన దయ్యాల శ్రీకాంత్‌తో ఐదు ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. కాగా ఈ మధ్య కాలంలో దంపతుల మధ్య విబేధాలు రాగా.. భార్య రాధిక ఒక కుమారుడు అనిరుధ్(3)ను తీసుకుని కటికపల్లి గ్రామంలో తన బంధువుల వద్ద ఉంటుంది.
ఈ క్రమంలో భర్తపై ఉన్న కోపంతో కొడుకు అనిరుధ్‌ను శుక్రవారం కుందుకూరు చౌరస్తాలో వదిలేసి వెళ్లిపోయింది. దాంతో ఆచిన్నారి దిక్కుతోచక ఏడుస్తూ ఆ రోడ్డు పై తిరుగుతూ ఉన్న సమయంలో అటుగా వెళ్తున్న పోలీసులు బాలుడిని చూసి చేరదీశారు. బాలుడిని తల్లిదండ్రులు, ఊరు అడుగగా ఆ చిన్నారి చెప్పలేక పోయాడు. దీంతో పోలీసులు బాలుడి ఫొటోను వాట్సాప్‌లో పెట్టి.. సంబంధీకులు , తెలిసినవారు ఎవరైనా ఉంటే సంప్రదించాలంటూ ఫోన్ నంబర్ ఇచ్చారు.. క్షణాల్లో ఈ విషయం వాట్సాప్‌లో చెక్కర్లు కొట్టడంతో కేవలం నాలుగు గంటల్లో బాలుడి తండ్రి శ్రీకాంత్ కొడుకు కోసం పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. కొడుకును తన భార్య రాధికనే వదలి పెట్టి వెళ్లినట్లు పోలీసులకు. అనంతరం పూర్తి వివరాలు తెలుసినుకొని బాలుడిని తన తండ్రికి అప్పగించారు పోలీసులు.
మరిన్ని ఇక్కడ చదవండి :
Donkeys Missing: గాడిదల అక్రమ రవాణా.. మాంసం కోసం ఎగబడుతున్న జనాలు.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..