Telangana: ‘వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను’.. జగ్గారెడ్డి వ్యాఖ్యల వెనకాల ఆంతర్యం ఏంటి.?

జగ్గారెడ్డి పరిచయం అక్కర్లేని పేరు.. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు ఆయన ఏది మాట్లాడిన అది పెద్ద బ్రేకింగ్ అయిపోవలసిందే...జగ్గారెడ్డి తాజాగా చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాలో పెద్ద చర్చకు దారి తీశాయి. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయను అని జగ్గారెడ్డి చెప్పిన ఈ ఒక్క మాటతో అందరూ ఆశ్చర్యానికి గురి అవుతున్నారు...

Telangana: 'వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను'.. జగ్గారెడ్డి వ్యాఖ్యల వెనకాల ఆంతర్యం ఏంటి.?
Jagga Reddy
Follow us

| Edited By: Narender Vaitla

Updated on: Oct 15, 2024 | 2:08 PM

ఆయనో మాస్ లీడర్.. ఉమ్మడి రాష్ట్రంలోనైనా.. స్వరాష్ట్రంలో నైనా…ఆయన ఏది మాట్లాడిన ఓ సెన్సేషనలే.. ఆయన మాటలు పొలిటికల్ హిట్ ను పెయించుతాయి. అలాంటి నేత మరాసారి మాటల తూటాలు పేల్చడు…ఇప్పుడు అవే పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారాయి.. ఇంతంకి ఎవరా నేత….? ఆయన చేసే వ్యాఖ్యలు ఏంటి తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

జగ్గారెడ్డి పరిచయం అక్కర్లేని పేరు.. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు ఆయన ఏది మాట్లాడిన అది పెద్ద బ్రేకింగ్ అయిపోవలసిందే…జగ్గారెడ్డి తాజాగా చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాలో పెద్ద చర్చకు దారి తీశాయి. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయను అని జగ్గారెడ్డి చెప్పిన ఈ ఒక్క మాటతో అందరూ ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో జరిగే పండుగలను ఘనంగా నిర్వహించడం జగ్గారెడ్డికి అలవాటు. అందులో భాగంగానే మొన్న జరిగిన దసరా పండుగను స్వంత డబ్బులతో చాలా ఘనంగా నిర్వహించారు.

కాంగ్రెస్ కార్యకర్తలు, జగ్గారెడ్డి అనుచరులు అందరూ ఫుల్ జోష్ లో ఉండగా..దసరా వేడుకల స్పీచ్ లో జగ్గారెడ్డి తన రాజకీయా భవిష్యత్ పై బాంబు పేల్చాడు. ఈ మాటలు విన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,జగ్గారెడ్డి అనుచరులు ఒక్కసారిగా షాక్ కు గురైయ్యారు. తన రాజకీయ జీవితం కౌన్సిలర్ గా మొదలై ఇక్కడికి వరకు వచ్చింది అని, తాను మొదటిసారి కౌన్సిలర్ గా పోటీ చేసినప్పుడు అవతలి పార్టీ వారు రిగ్గింగ్ చేస్తుంటే.. అప్పటి ఎస్పీ కారును తన కారుతో ఢీ కొట్టాను అని,నేను కూడా రిగ్గింగ్ చేశాను అని, మున్సిపల్ చైర్మన్ అయ్యాను అని ఉత్సాహంతో జగ్గారెడ్డి స్పీచ్ ను వింటున్న కార్యకర్తలకు ఫుల్ జోష్ వచ్చింది.

కానీ చివరికి.. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను అని చెప్పేసరికి కాంగ్రెస్ శ్రేణులు కొంత ఆందోళనకు గురయ్యారు. వచ్చే ఎన్నికల్లో తన భార్య నిర్మల గానీ.. చేర్యాల ఆంజనేయులు గానీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంటూ దసరా పండుగ వేడుకల్లో ప్రకటించారు జగ్గారెడ్డి. ఎన్నికలకు మరో నాలుగేళ్లు సమయం ఉన్నప్పటికీ.. ఇప్పుడే ఈ విషయాన్ని ప్రకటిస్తున్నట్టు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌ‌డ్‌తో కూడా మాట్లాడానని చెప్పుకొచ్చారు. ప్రస్తుత పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.. 1986లో భారతీయ జనతా పార్టీ తరఫున సంగారెడ్డి పురపాలక సంఘం కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, 1995లో సంగారెడ్డి పురపాలక సంఘం చైర్మెన్ అయ్యారు.

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో సంగారెడ్డి శాసనసభ నియోజకవర్గం నుంచి అప్పటి టిఆర్ఎస్ పార్టీ తరపున పోటీచేసి, తన సమీప ప్రత్యర్థి అయిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కె. సత్యనారాయణపై 17,676 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి.. 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ శాసనసభకు ఎన్నికై 2012 నుంచి 2014 మధ్య ప్రభుత్వ విప్‌గా పనిచేశారు..ఇక 2014 శాసనసభ ఎన్నికలలో సంగారెడ్డి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి టీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ చేతిలో 29,814 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు..ఇక మళ్ళీ 2018 శాసనసభ ఎన్నికలలో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి టీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ పై 2,522 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

ఇలా మొత్తం మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు జగ్గారెడ్డి..ప్రతిసారి జగ్గారెడ్డి మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేస్తుండేవారు. గతంలో తాను తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతానని కూడా అన్నారు. కానీ ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. అయినప్పటికీ కూడా రాజకీయాల్లో యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. అయితే ఇప్పుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తాను పోటీ చేయనని బాంబు పేల్చడంతో రాజకీయ వర్గాల్లో జగ్గారెడ్డి మాటలతో ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ శ్రేణులు సైతం ఆయన తీసుకున్న నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు దసరా వేడుకల స్పీచ్ లో 2024లో తన ఓటమి పై మాట్లాడుతూ జగ్గారెడ్డి ఒకింత బావోద్వేగానికి గురయ్యారు. ఓటమి అనేక పాఠాలు నేర్పిస్తుందని, తాను ఓడిపోయినా.. తన భార్యకు కార్పొరేషన్ పదవి వచ్చిందని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పిలిచి.. తన భార్య నిర్మలకు పదవిచ్చారని, తాను ఓడిపోవడం వల్లే నిర్మలాకు ఆ పదవి వచ్చింది అని చెప్పుకొచ్చారు. అయితే జగ్గా రెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక ఎదైనా వ్యూహం కచ్చితంగా ఉండే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

జగ్గారెడ్డి వ్యాఖ్యల ఆంతర్యం ఏంటి.? పోటీ చేయనని ఎందుకన్నారు
జగ్గారెడ్డి వ్యాఖ్యల ఆంతర్యం ఏంటి.? పోటీ చేయనని ఎందుకన్నారు
అమెరికాలో ఉండే తెలుగు విద్యార్థుల కోసం ఆహా సరికొత్త నిర్ణయం..
అమెరికాలో ఉండే తెలుగు విద్యార్థుల కోసం ఆహా సరికొత్త నిర్ణయం..
మీ కాలి రెండో బొటనవేలు పెద్దదా.? వ్యక్తిత్వం ఇదే
మీ కాలి రెండో బొటనవేలు పెద్దదా.? వ్యక్తిత్వం ఇదే
బాబోయ్‌.. గోతులు తీసే పామును ఎప్పుడైనా చూశారా..? షాకింగ్‌ వీడియో
బాబోయ్‌.. గోతులు తీసే పామును ఎప్పుడైనా చూశారా..? షాకింగ్‌ వీడియో
రవి నీచత్వంతో ఆ రాశుల వారికి కొత్త సమస్యలు.. పరిహారాలు ఇవే..
రవి నీచత్వంతో ఆ రాశుల వారికి కొత్త సమస్యలు.. పరిహారాలు ఇవే..
లక్కీ ఛాన్స్ అంటే వీళ్లదే గురూ..! భార్యభర్తలకు ఆరు మద్యం దుకాణాలు
లక్కీ ఛాన్స్ అంటే వీళ్లదే గురూ..! భార్యభర్తలకు ఆరు మద్యం దుకాణాలు
పంట పొలాల్లో పాదముద్రలు.. భయం గుప్పెట రైతులు!
పంట పొలాల్లో పాదముద్రలు.. భయం గుప్పెట రైతులు!
కొత్త ఫోన్‌ కొంటున్నారా.? మార్కెట్లోకి దూసుకొస్తున్న నయా మాల్‌
కొత్త ఫోన్‌ కొంటున్నారా.? మార్కెట్లోకి దూసుకొస్తున్న నయా మాల్‌
యజమాని మరణం తట్టుకోలేక శునకం కన్నుమూత.. కన్నీరుమున్నీరైన కుటుంబం
యజమాని మరణం తట్టుకోలేక శునకం కన్నుమూత.. కన్నీరుమున్నీరైన కుటుంబం
మూసీ పరివాహాక ప్రజలకు అలర్ట్‌.. తెరుచుకున్న జంట జలాశయాల గేట్లు
మూసీ పరివాహాక ప్రజలకు అలర్ట్‌.. తెరుచుకున్న జంట జలాశయాల గేట్లు