Telangana: పొలంలో పాదముద్రల కలకలం.. భయాందోళనలో రైతులు, కూలీలు..!

అడవుల్లో ఉండాల్సిన వన్య మృగాలు.. తరచూ జనావాసాల్లోకి వస్తున్నాయి. ప్రజల్ని హడలెత్తిస్తున్నాయి. జీవాలు, మనుషులపై దాడులు చేస్తున్న ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి.

Telangana: పొలంలో పాదముద్రల కలకలం.. భయాందోళనలో రైతులు, కూలీలు..!
Leopard Footprints
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Oct 15, 2024 | 1:32 PM

అడవుల్లో ఉండాల్సిన వన్య మృగాలు.. తరచూ జనావాసాల్లోకి వస్తున్నాయి. ప్రజల్ని హడలెత్తిస్తున్నాయి. జీవాలు, మనుషులపై దాడులు చేస్తున్న ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల రోజుకో చోట చిరుతల దర్శనంతో జనం హడలెత్తి పోతున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. పంట పొలాల్లో చిరుత పాదముద్రలు చూసిన రైతులు, కూలీలు భయాందోళనలకు గురవుతున్నారు. దీంతో సమీప గ్రామాల్లోని జనం అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచిస్తున్నారు.

తాజాగా జూలూరుపాడు అటవీ రేంజ్ సరిహద్దు ప్రాంతంలోని మున్యాతండా, భద్రుతండా గ్రామాల సమీపంలోని పంట పొలాల్లో చిరుత పులి సంచరిస్తోందని గ్రామస్తులు అంటున్నారు. మున్యాతండాలో ఓ రైతు పొలం వద్ద కాపలా కోసం . కుక్కను కట్టేసి ఉంచగా, చిరుత దాన్ని కొంతదూరం ఈడ్చుకుని వెళ్లిందని స్థానికు లు చెబుతున్నారు.

పొలంలో పాదముద్రలు పొలాల్లో చిరుత అడుగు జాడలు కనిపించాయంటూ స్థానికులు, రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా జూలూరుపాడు ఎఫ్‌ఆర్‌వో ప్రసాద్ రావు బృందం స్పాట్‌కు చేరకుని పాదముద్రలను పరిశీలించారు. అవి చిరుతకు సంబంధించిన గుర్తులేనని అనుమానం వ్యక్తం చేశారు. జూలూరుపాడు, తల్లాడ అటవీ రేంజ్ సరిహద్దు ప్రాంతాల్లోని పొలాల్లో చిరుత అడుగుజాడలు కనిపించాయని అధికారులు ధృవీకరించారు.

చిరుత అడుగు జాడలను పరిశీలిస్తున్న అటవీ శాఖ అధికారులు, పాదముద్రలు చిరుతకు చెందినవేనని నిర్ధారిచారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తామని చెప్పారు. రైతులు, కూలీలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. గొర్రె లు, పశువుల కాపరులు జాగ్రత్త వహించాలన్నారు. పొలాలు, అటవీ ప్రాంతాల్లోకి ఒంటరిగా వెళ్లవద్దని, మున్యా తండా, భద్రు తండా, భీమ్లాతండా గ్రామాల ప్రజలు రాత్రి వేళ ఇంటి నుంచి బయటకు రావద్దని సూచించారు. చిరుత సంచారం కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

పంట పొలాల్లో పాదముద్రలు.. భయం గుప్పెట రైతులు!
పంట పొలాల్లో పాదముద్రలు.. భయం గుప్పెట రైతులు!
కొత్త ఫోన్‌ కొంటున్నారా.? మార్కెట్లోకి దూసుకొస్తున్న నయా మాల్‌
కొత్త ఫోన్‌ కొంటున్నారా.? మార్కెట్లోకి దూసుకొస్తున్న నయా మాల్‌
యజమాని మరణం తట్టుకోలేక శునకం కన్నుమూత.. కన్నీరుమున్నీరైన కుటుంబం
యజమాని మరణం తట్టుకోలేక శునకం కన్నుమూత.. కన్నీరుమున్నీరైన కుటుంబం
మూసీ పరివాహాక ప్రజలకు అలర్ట్‌.. తెరుచుకున్న జంట జలాశయాల గేట్లు
మూసీ పరివాహాక ప్రజలకు అలర్ట్‌.. తెరుచుకున్న జంట జలాశయాల గేట్లు
ఆ చిన్నారి ఇంత వయ్యారంగా మారిపోయింది..
ఆ చిన్నారి ఇంత వయ్యారంగా మారిపోయింది..
వాటే సింప్లిసిటీ.. ఈ ప్రధాని పనికి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే
వాటే సింప్లిసిటీ.. ఈ ప్రధాని పనికి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే
అపర్ణ ప్లాన్ సక్సెస్.. రుద్రాణి మాస్టర్ ప్లాన్.. బయటపడిన నిజం!
అపర్ణ ప్లాన్ సక్సెస్.. రుద్రాణి మాస్టర్ ప్లాన్.. బయటపడిన నిజం!
రోజుకి ఎన్ని ఎండు ద్రాక్ష తినాలి..? అతిగా తింటే అనర్థాలే సుమీ..!
రోజుకి ఎన్ని ఎండు ద్రాక్ష తినాలి..? అతిగా తింటే అనర్థాలే సుమీ..!
కారం ఎక్కువగా తింటే నష్టాలే కాదు.. లాభాలు కూడా ఉన్నాయండోయ్‌
కారం ఎక్కువగా తింటే నష్టాలే కాదు.. లాభాలు కూడా ఉన్నాయండోయ్‌
హుషారుగా తలైవా దర్శకులు.. ఈ కెప్టెన్ల నెక్స్ట్ మజిలీ ఏంటి.?
హుషారుగా తలైవా దర్శకులు.. ఈ కెప్టెన్ల నెక్స్ట్ మజిలీ ఏంటి.?