Telangana Rains: తెలంగాణకు డేంజర్‌ వార్నింగ్‌.. పలు జిల్లాలకు రెడ్, ఎల్లో అలెర్ట్స్.. మరోసారి భారీ వర్షం

వర్షాలు మరోసారి దుమ్మురేపనున్నాయి. అవును IMD తెలంగాణకు భారీ వర్ష సూచన చేసింది. పలు జిల్లాల్లో వానలు దంచికొట్టనున్నాయని తెలిపింది.

Telangana Rains: తెలంగాణకు డేంజర్‌ వార్నింగ్‌.. పలు జిల్లాలకు రెడ్, ఎల్లో అలెర్ట్స్.. మరోసారి భారీ వర్షం
Telangana Rains
Follow us

|

Updated on: Jul 24, 2022 | 6:45 PM

Telangana Weather Report: తెలంగాణ ప్రజలకు హైఅలర్ట్‌, కాదు.. కాదు డేంజర్‌ వార్నింగ్‌ ఇది. అప్రమత్తంగా లేకపోతే మళ్లీ కొంపకొల్లేరైపోవడం ఖాయం. అవును, మీరు వింటున్నది నిజమే. తెలంగాణకు మరోసారి డేంజర్‌ వార్నింగ్‌ ఇచ్చింది ఐఎండీ. మళ్లీ వరుణుడు విజృంభించడం ఖాయమని హెచ్చరించింది. మరో మూడ్రోజులపాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని చెబుతోంది వాతావరణశాఖ. డిస్ట్రిక్ట్‌ వైజ్‌గా రెడ్‌, ఆరెంజ్‌, ఎల్లో, గ్రీన్‌ అలర్ట్స్ జారీ చేసింది వెదర్‌ డిపార్ట్‌మెంట్‌. మరి, ఏఏ జిల్లాలు డేంజర్‌లో ఉన్నాయ్‌? ఏ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ఇష్యూ అయ్యింది? ఆరెంజ్‌ వార్నింగ్‌ ఏఏ జిల్లాలకు తెలుసుకుందాం పదండి.

హైదరాబాద్ వాతావరణ శాఖ తాజాగా విడుదల చేసిన వెదర్ అప్‌డేట్…

ఆదివారం ఆదిలాబాద్, కోమరం బీమ్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో  భారీ వర్షాలు పడతాయని అంటోంది వెదర్‌ డిపార్ట్‌మెంట్‌. అలాగే సోమవారం జగిత్యాల, మంచిర్యాల, వరంగల్‌, హన్మకొండ, మహబూబాబాద్‌, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో కుండపోత ఖాయమంటోంది IMD. ఆదిలాబాద్‌, కుమ్రుంభీమ్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, మెదక్‌, సంగారెడ్డి, జనగాం, భువనగిరి, మేడ్చల్‌ డిస్ట్రిక్ట్స్‌లో భారీ వర్షాలు కురుస్తాయంటూ ఆరెంజ్‌ అలర్ట్‌ ఇచ్చింది. అలాగే జూలై 26వ తేదీన 11 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, మంచిర్యాల, వరంగల్‌, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటోంది వెదర్ డిపార్ట్‌మెంట్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..