వాడంతే.. అదో టైపు.. దొంగతనం చేస్తాడు.. ఇట్టే దొరికిపోతాడు..

మేడారంలో ఓ దొంగ షాప్‌లోకి చొరబడి కొంతడబ్బు, షాప్ లో సామాగ్రి అపహరించుకుపోయాడు.. షాప్ లో చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దొంగను పోలీసులు అతి సులభంగా పట్టేశారు.. ఎందుకంటే అతడు పాత నేరస్తుడు..

వాడంతే.. అదో టైపు.. దొంగతనం చేస్తాడు.. ఇట్టే దొరికిపోతాడు..
Medaram Robbery Case

Edited By:

Updated on: Apr 15, 2026 | 11:18 AM

మేడారంలో ఓ దొంగ షాప్‌లోకి చొరబడి కొంతడబ్బు, షాప్ లో సామాగ్రి అపహరించుకుపోయాడు.. షాప్ లో చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దొంగను పోలీసులు అతి సులభంగా పట్టేశారు.. ఎందుకంటే అతడు పాత నేరస్తుడు.. పైగా వికలాంగుడు.. అతను నడిచే దృశ్యాల ఆధారంగా వీడు వాడే అని ఖాకీలు అలవోకగా పట్టేశారు. దొంగతనమే అతని ప్రవృత్తి.. కానీ దొంగతనం చేసిన ప్రతిసారి దొరికిపోవడమే అతని దరిద్రం..

కొద్దిరోజుల క్రితం మేడారం లోని ఓ దుకాణంలో చోరీ జరిగింది. రాత్రి 8 గంటలకు ఈ దొంగతనం జరుగినట్టుగా సీసీ రికార్డ్ లో నమోదైంది.. అయితే మేడారంలో ఎక్కడెక్కడి నుండో జీవనోపాధి నిమిత్తం వచ్చి కిరాయిలు వెచ్చించి పలు రకాల షాపులు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం మేడారం వచ్చే భక్తుల తాకిడి కూడా పెరిగిపోతుంది.. ఇదే అదునుగా దొంగలు కూడా వారి చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు.

తాళంవేసి ఉన్న షాపులను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్నారు. రెక్కీ నిర్వహించి చోరీలు చేస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఆ దొంగను అవలిలగా పట్టేశారు. పాత దొంగే అని కనిపెట్టేశారు. నార్లాపూర్ కు చెందిన అతడు గతంలో తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడ్డట్టు పోలీస్ రికార్డులలో ఉంది. గతంలో ఏటూరునాగారం లోని ఒక ఆలయంలో కూడా చోరీకి పాల్పడి పోలీసులకు దొరికాడు.

అయితే ఇతగాడు వికలాంగుడు.. సీసీ కెమెరాలలో అతని కదలికల ద్వారా పోలీసులు అట్టే పసిగట్టేశారు.. ఇతను పాత నేరస్తుడే అని కనిపెట్టారు.. అతని దరిద్రం ఏంటంటే ఎక్కడికి వెళ్లినా అవలీలగా దొరికిపోవడం..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us