Viral Video: వర్షాకాలం వచ్చిందని క్లీనింగ్ పనులు స్టార్ట్ చేశారు.. మ్యాన్‌హోల్‌లో ఓపెన్ చేయగా

హైదరాబాద్‌లోని మైలార్దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. కాటేదాన్ ఓల్డ్ కర్నూలు రోడ్డులో మ్యాన్‌హోల్స్ శుభ్రం చేస్తున్న GHMC సిబ్బందికి ఊహించని సీన్ ఎదురైంది.. ఓ మ్యాన్‌హోల్‌లో పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో అస్తిపంజరం కనిపించింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Viral Video: వర్షాకాలం వచ్చిందని క్లీనింగ్ పనులు స్టార్ట్ చేశారు.. మ్యాన్‌హోల్‌లో ఓపెన్ చేయగా
Manhole Cleaning Hyderabad

Edited By:

Updated on: Jun 12, 2026 | 8:00 PM

వర్షాకాలం వస్తుందని మ్యాన్‌ హోల్స్‌ క్లీన్ చేస్తున్న జీహెచ్‌ఎంసీ సిబ్బందికి ఊహించని సీన్ ఎదురైంది. మ్యాన్‌హోల్‌లో కుల్లిపోయిన స్థితిలో అస్తిపంజరం కనిపించింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని కాటేదాన్ ఓల్డ్ కర్నూలు రోడ్డులో వెలుగు చూసింది. అస్తిపంజరాన్ని గమనించిన జీహెచ్‌ఎంసీ సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అనంతరం మైలార్దేవ్‌పల్లి పోలీసులకు విషయం తెలియజేయడంతో వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

ఇక ఘటన కేసు నమోదు చేసుకున్న పోలీసులు అస్తిపంజరాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో అస్తిపంజరం పురుషుడిదా లేదా మహిళదా.. ఈ మనిషి ఎన్నాళ్ల క్రితం చనిపోయారనే విషయాలను తెలుసుకునే పనిలో పడ్డారు.

అలాగే, ఆ వ్యక్తి మరణం సహజమా, ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఏదైనా నేరానికి సంబంధించినదా అనే అంశాలపై కూడా పోలీసులు విచారణ చేపట్టారు. అస్తిపంజరం మ్యాన్‌హోల్‌లోకి ఎలా చేరింది, ఎంతకాలంగా అక్కడే ఉంది, దాని వెనుక ఏవైనా అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయా అనే కోణాల్లో దర్యాప్తు వేగవంతం చేశారు.

వీడియో చూడండి..

ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫోరెన్సిక్ నివేదికలు వచ్చిన తర్వాతే మృతుడి గుర్తింపు, మరణానికి గల కారణాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us