Hyderabad: పోలీస్ స్టేషన్‎కు తీసుకెళ్తామని నమ్మించి యువతిపై అత్యాచారం.. నిందితులు అరెస్ట్

| Edited By: Srikar T

Jan 08, 2024 | 10:46 AM

పాతబస్తీలో దారుణ ఘటన చోటు చేసుకుంది బాధితురాలని పోలీస్ స్టేషన్‎కు తీసుకెళ్తామని చెప్పి ఓ యువతిపై ఇద్దరు నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు శనివారం అర్ధరాత్రి బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి నిందితులు ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‎కు తరలించారు.

Hyderabad: పోలీస్ స్టేషన్‎కు తీసుకెళ్తామని నమ్మించి యువతిపై అత్యాచారం.. నిందితులు అరెస్ట్
Two Youths Arrest
Follow us on

పాతబస్తీలో దారుణ ఘటన చోటు చేసుకుంది బాధితురాలని పోలీస్ స్టేషన్‎కు తీసుకెళ్తామని చెప్పి ఓ యువతిపై ఇద్దరు నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు శనివారం అర్ధరాత్రి బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి నిందితులు ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‎కు తరలించారు.

సూర్యాపేటకు చెందిన యువతి తన సోదరుడు తల్లితో కలిసి ఉంటోంది. శనివారం బాధితురాలికి తన సోదరుడితో ఏదో విషయంపై గొడవ జరుగగా అతడు ఆమెపై చేయి చేసుకున్నాడు. దీంతో మనస్థాపానికి గురైన యువతి హైదరాబాద్‎కు బయలుదేరింది. రాత్రి 10:40 నిమిషాలకి ఎంజీబీఎస్ బస్టాండ్‎లో దిగిన ఆమె సమీపంలోని టీ కొట్టులో టీ తాగి అఫ్జల్‎గంజ్ వైపు నడుచుకుంటూ వెళ్ళింది. ఈ క్రమంలో గౌస్‎నగర్‎కు చెందిన మొలకపెంట శ్రీకాంత్ అఫ్జల్‎గంజ్‎కు చెందిన పానగంటి కాశీ విశ్వనాధులు ఆమెను ద్విచక్ర వాహనంపై ఫాలో అయ్యారు. బాధితురాలని సమీపించిన వారు ఎక్కడికి వెళ్లాలని అడగ్గా ఆమె పోలీస్ స్టేషన్‎కు వెళ్తున్నట్టు తెలిపింది.

ఆమెను పోలీస్ స్టేషన్ వద్ద తీసుకెళ్తామని చెప్పి బైక్ ఎక్కించుకొని ఆ తర్వాత ఆమెకు ఐస్ క్రీమ్ తినిపించి వాళ్లపై నమ్మకం కలిగేలా చేశారు. ఇద్దరు నిందితులు అనంతరం బాధితురాలని లేక్ వ్యూ హిల్స్ సమీపంలోని ఉన్న శ్రీకాంత్‎కు చెందిన స్క్రాప్ గోడౌన్‎కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు . అనంతరం ఆమెను బైక్ పై మరోచోటికి తరలిస్తూ ఉండడంతో యువతి పెద్ద ఎత్తున అరవగా స్థానికులు అప్రమత్తమయి యువతిని, నిందితులు వదిలిపెట్టి పరారయ్యారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తనపై అఘాయిత్యం జరిగిన చోటును పోలీసులకు చూపించింది యువతి. ఈ గోడౌన్ నిందితులలో ఒకరైన శ్రీకాంత్ కు సంబంధించినదిగా తెలుసుకున్నారు పోలీసులు. అతనిని వెంటనే అదుపులోకి తీసుకోగా తన స్నేహితుడు కాశీ విశ్వనాధంను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‎కు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..