TSPSC Group 4 Hall Tickets: నేటి నుంచి వెబ్‌సైట్‌లో గ్రూప్‌-4 హాల్‌టికెట్లు.. ఇక్కడ నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోండి

తెలంగాణ గ్రూప్‌-4 రాతపరీక్షకు సంబంధించిన హాల్‌ టికెట్లు శనివారం (జూన్‌ 24) విడుదలకానున్నాయి. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ రోజు నుంచి అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. రాత పరీక్ష..

TSPSC Group 4 Hall Tickets: నేటి నుంచి వెబ్‌సైట్‌లో గ్రూప్‌-4 హాల్‌టికెట్లు.. ఇక్కడ నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోండి
TSPSC Group 4 Hall Tickets

Updated on: Jun 24, 2023 | 9:06 AM

హైదరాబాద్‌: తెలంగాణ గ్రూప్‌-4 రాతపరీక్షకు సంబంధించిన హాల్‌ టికెట్లు శనివారం (జూన్‌ 24) విడుదలకానున్నాయి. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ రోజు నుంచి అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. రాత పరీక్ష జులై 1వ తేదీన టీఎస్పీయస్సీ నిర్వహించనుంది. కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 8,180 గ్రూప్‌ 4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలసిందే. ఈ నియామక ప్రక్రియను టీఎస్పీయస్సీ వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా రాత పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు శనివారం నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది.

పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందు వరకు ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. పరీక్ష సమయానికి రెండు గంటల ముందే సంబంధిత ఎగ్జాం సెంటర్లకు చేరుకోవాల్సి ఉంటుందని టీఎస్‌పీఎస్సీ అధికారులు సూచించారు. వచ్చే శనివారం (జూలై 1వ తేదీన) రెండు సెషన్లలో పరీక్షను నిర్వహించనున్నారు. మొదటి సెషన్‌ ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పేపర్‌-1 పరీక్ష, రెండో సెషన్‌లో మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us