డీజీపీ హెచ్చరించిన గంటల్లోనే ఘోరం..! ఎన్‌హెచ్-44పై లారీ ఢీకొని డ్రైవర్ సజీవ దహనం..!

జాతీయ‌ రహదారులపై నిబందనలకు విరుద్దంగా ఎక్కడపడితే అక్కడ లారీలు నిలపడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా డీజీపీ సి.వి.ఆనంద్ తెలిపిన కొన్ని గంటల్లోనే జాతీయ రహదారి 44 పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నాగపూర్ నుండి హైదరాబాద్‌కు ఆలుగడ్డల లోడ్ తో వెళుతున్న లారీ జాతీయ రహదారిపై నిలుపడంతో దానిని గమనించని మరో లారీ వెనుక నుండి ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వెనుక లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి క్యాబిన్ లోనే లారీ డ్రైవర్ సజీవ దహనం అయ్యాడు.

డీజీపీ హెచ్చరించిన గంటల్లోనే ఘోరం..! ఎన్‌హెచ్-44పై లారీ ఢీకొని డ్రైవర్ సజీవ దహనం..!
Nirmal Road Accident

Edited By:

Updated on: Jun 11, 2026 | 1:06 PM

జాతీయ‌ రహదారులపై నిబందనలకు విరుద్దంగా ఎక్కడపడితే అక్కడ లారీలు నిలపడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా డీజీపీ సి.వి.ఆనంద్ తెలిపిన కొన్ని గంటల్లోనే జాతీయ రహదారి 44 పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నాగపూర్ నుండి హైదరాబాద్‌కు ఆలుగడ్డల లోడ్ తో వెళుతున్న లారీ జాతీయ రహదారిపై నిలుపడంతో దానిని గమనించని మరో లారీ వెనుక నుండి ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వెనుక లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి క్యాబిన్ లోనే లారీ డ్రైవర్ సజీవ దహనం అయ్యాడు. రోడ్డు పై నిలిపిన లారీలోని డ్రైవర్, క్లీనర్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డ. అగ్నికిలలు ఎగిసిపడటంతో రెండు లారీలు దగ్దమయ్యాయి. ఈ ఘటన మరువక‌ ముందే కొన్ని గంటల వ్యవదిలోనే అదే చోట మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడం స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది.

వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా రూరల్ మండలం మేడిపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారి 44 పై రెండు లారీలు ఢీకొని మంటలు చెలరేగడంతో డ్రైవర్ సజీవ దహనం అయ్యాడు. నాగ్‌పూర్ వైపు నుండి ఆలుగడ్డల లోడుతో హైదరాబాద్ వైపు లారీ వెళ్తున్న లారీ ఆకస్మాత్తుగా టైర్ పంచర్ కావడంతో మేడిపల్లి గ్రామం వద్ద హైవేపై పక్కకు నిలిపి ఉంచాడు. అదే సమయంలో జొన్నల లోడుతో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళుతున్న లారీ రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని వెనుక నుంచి వేగంగా ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా వెనుక లారీలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆదిలాబాద్ జిల్లా సోనాల మండలానికి చెందిన లారీ డ్రైవర్ జవారి సింగ్ లారీ క్యాబిన్ లో చిక్కుకొని సజీవ దహనం అయ్యారు. మంటలు ముందు లారీకి సైతం వ్యాపించడంతో ఆలుగడ్డ లోడ్ లారీ క్యాబిన్ లో ఉన్న డ్రైవర్, క్లీనర్ ఒక్కసారిగా కిందికి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకోగా.. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

రంగంలోకి దిగిన పోలీసులు.. ట్రాఫిక్ ను మళ్లించి.. సహాయక చర్యలు చేపట్టారు. ఇదే సమయంలో అతి వేగంగా వచ్చిన ఓ కారు ఎదురుగా వస్తున్న లారీని అదే ప్రాంతంలో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ కు స్వల్ప గాయాలవగా.. రహదారిపై పక్కనే ఉన్న స్థానికులు ప్రాణభయంతో ఒక్కసారిగా పరుగులు తీశారు. ఆదిలాబాద్ వైపు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఇన్నోవా కారు, ఎదురుగా ఆదిలాబాద్ వైపు వెళ్తున్న లారీని వేగంగా ఎదురెదురుగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గంటల వ్యవధిలో ఒకే చోట రెండు వేరు వేరు ప్రమాదాలు చోటు చేసుకోవడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఈ రెండు ప్రమాదాలకు అతివేగం నిర్లక్ష్యమే కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

బుధవారం (జూన్ 11) ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో పర్యటించిన డీజీపీ సి.వి.ఆనంద్ జాతీయ రహదారులపై ప్రమాదాలకు ప్రదాన కారణం నిర్లక్ష్యం, జాతీయ రహదారి పై లారీలను‌ ఎక్కడపడితే అక్కడ ఆపడమే ప్రదాన కారణం అని సూచించారు. ఆయన చెప్పి 24 గంటలు‌ కూడా కాకముందే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us