Viral: ఎంత పని చేశావ్ హల్క్.! ఆడుకుంటుండగా నోట్లోంచి రాని మాట.. ఎక్స్‌రే తీసి కంగుతిన్న డాక్టర్లు

అయ్యో..! అయ్యయ్యో.! పాపం ఆ పిల్లాడికి ఒక్కసారిగా మాట రాలేదు. ఆడుకుంటుండగా నోట్లోంచి మాటలు రాలేదు. అలాగే ఒక్కసారిగా కింద పడిపోయాడు. దీంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు వెంటనే హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఏమైందా అని డాక్టర్లు టెస్ట్ చేసి చూడగా..

Viral: ఎంత పని చేశావ్ హల్క్.! ఆడుకుంటుండగా నోట్లోంచి రాని మాట.. ఎక్స్‌రే తీసి కంగుతిన్న డాక్టర్లు
Viral News

Updated on: Feb 04, 2026 | 11:47 AM

స్పైడర్‌ మ్యాన్, సూపర్‌ మ్యాన్, హల్క్‌… వీళ్లే ఈ జనరేషన్‌ చిన్నారులకు బెస్ట్‌ ఫ్రెండ్స్…! వాళ్ల వీడియోలు చూస్తూనే తింటారు… ఆ టాయ్స్‌నే పట్టుకుని పడుకుంటారు…! కాసేపు అవి కనిపించకపోతే పేరెంట్స్‌తో యుద్ధాలే చేస్తారు. అయితే… ఈ ఆటబొమ్మలే ఇప్పుడు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. అహ్మదాబాద్‌లో ఓ సంఘటన డాక్టర్లకే సవాల్ విసిరింది. యస్.! ఆడుకుంటూ ఆడుకుంటూ హల్క్ బొమ్మను మింగేశాడీ పిల్లోడు. బొమ్మ కావాలని మారాం చేస్తే కొనిచ్చిన తల్లిదండ్రులనే కొన్ని గంటలపాటు ఏడ్పించాడు. అటు సీనియర్‌ డాక్టర్లకు సైతం చుక్కలు చూపించాడు. ఎట్టకేలకు గొంతులోకి వెళ్లిన హల్క్ టాయ్‌ని వైద్యులు బయటకు తీయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఏడాదిన్నర వయసున్న వంశ్‌ ఆడుకుంటూ హల్క్ బొమ్మను మింగేశాడు. నోట్లోంచి మాట రాకపోవడం… ఒక్కసారిగా కిందపడిపోవడంతో గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అసలేం జరిగిందో తెలుసుకోవడానికి పరీక్షలు చేసిన వైద్యులు… ఎండోస్కోపీ ద్వారా గొంతులో హల్క్ బొమ్మ ఉన్నట్లు గుర్తించారు. ఆ బొమ్మను బయటకు తీసేందుకు ఎంతో శ్రమించారు. గొంతుభాగం అతి సున్నితంగా ఉండటం… లోపలికి పంపిన మిషినరీ ఆ బొమ్మను పట్టుకోగానే జారిపోతుండటం డాక్టర్లకు సవాల్‌గా మారింది. ఇక కొన్నిగంటలపాటు శ్రమించిన వైద్యులు ఎట్టకేలకు బొమ్మను బయటకు తీసి పిల్లాడి ప్రాణాలు కాపాడారు. దీంతో కుటుంబ సభ్యులంతా ఊపిరిపీల్చుకున్నారు. మొత్తంగా… గతకొంతకాలంగా ఇలాంటి కేసులు ఎక్కువవుతున్నాయంటున్నారు వైద్యులు. చిన్నారులు ఆడుకునేందుకు ఇచ్చే బొమ్మల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. అంతేకాదు.. వాళ్లు ఆడుకునేటప్పుడు తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని సూచిస్తున్నారు.

ఇది చదవండి: గంగమ్మకు మొక్కి చెరువులో వల వేసిన జాలరి.. చిక్కింది చూసి స్టన్

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..