స్కూటీ పార్క్ చేసి షాప్‌లోకి వెళ్లాడు.. తిరిగి వచ్చేసరికి ఊహించని సీన్..!

Updated on: Sep 13, 2025 | 5:43 PM

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల పరిధిలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. తాజాగా శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలే దొంగతనం జరిగింది. నిలిపి ఉన్న స్కూటీ డిక్కీలోని నగదును దుండగులు దోచుకెళ్లారు. ఎర్వగూడకి చెందిన ప్రదీప్ గౌడ్ శుక్రవారం మధ్యాహ్నం బ్యాంకులో డిపాజిట్ చేయడానికి రూ. 2.98 లక్షలు బ్యాంకుకు ఎత్తుకెళ్లాడు.

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల పరిధిలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. తాజాగా శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలే దొంగతనం జరిగింది. నిలిపి ఉన్న స్కూటీ డిక్కీలోని నగదును దుండగులు దోచుకెళ్లారు. ఎర్వగూడకి చెందిన ప్రదీప్ గౌడ్ శుక్రవారం మధ్యాహ్నం బ్యాంకులో డిపాజిట్ చేయడానికి రూ. 2.98 లక్షలు బ్యాంకుకు తీసుకువెళ్లాడు. అక్కడ జనాలు ఎక్కువగా ఉండడంతో స్కూటీ డిక్కీలో దాచి, తిరిగి పనిచేసే వన్ ల్యాబ్‌కు వెళ్లాడు. కొద్దిసేపటి తరువాత బయటకు వచ్చిన అతను నగదు చూసుకోగా కనిపించలేదు. దుండగులు స్కూటీలోని నగదునున దోచుకెళ్లినట్లు గుర్తించిన ప్రదీప్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, దుండగులు నగదు ఎత్తుకెళ్లిన దృశ్యాలు అక్కడ అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Published on: Sep 13, 2025 05:22 PM