Telangana: అయ్యో.. అయ్యోయ్యో.. ఈ దొంగకి ఎంత కష్టం వచ్చిపడిందే.. దరిద్రం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందిగా..

ఆసుపత్రి ముందు ఉన్న అంబులెన్స్‌ను ఎత్తుకెళ్లాడు.. సీన్ కట్ చేస్తే.. అంబులెన్స్ యాక్సిడెంట్ అయ్యి అదే హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు ఓ దొంగ.. ఈ షాకింగ్ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ఆరోగ్యం బాగాలేదని వచ్చాడు ఓ యువకుడు.. అంతలోనే బుద్ధి మారింది.. ఆరోగ్యం సంగతి ఏమో కానీ..

Telangana: అయ్యో.. అయ్యోయ్యో.. ఈ దొంగకి ఎంత కష్టం వచ్చిపడిందే.. దరిద్రం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందిగా..
Stolen Ambulance In Siddipe
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Aug 08, 2024 | 12:42 PM

ఆసుపత్రి ముందు ఉన్న అంబులెన్స్‌ను ఎత్తుకెళ్లాడు.. సీన్ కట్ చేస్తే.. అంబులెన్స్ యాక్సిడెంట్ అయ్యి అదే హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు ఓ దొంగ.. ఈ షాకింగ్ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ఆరోగ్యం బాగాలేదని వచ్చాడు ఓ యువకుడు.. అంతలోనే బుద్ధి మారింది.. ఆరోగ్యం సంగతి ఏమో కానీ.. ఆసుపత్రి ముందు ఉన్న అంబులెన్స్ అతని కళ్ళలో బడింది.. ఆరోగ్యం తర్వాత అయినా చూపించుకోవచ్చు ముందుగా అంబులెన్స్ సంగతి చూద్దాం అనుకున్నాడు.. అనుకున్నదే తడవుగా మెల్లిగా అంబులెన్స్ దగ్గరికి వెళ్లి లుక్కేశాడు.. ఆ తర్వాత ఎవ్వరూ చూడటం లేదని గమనించి.. అంబులెన్స్ తో అక్కడి నుంచి ఉడాయించాడు.. ఇక్కడి వరకు బాగానే ఉంది..

సీన్ కట్ చేస్తే.. అంబులెన్స్ ఎత్తుకెళ్తున్న క్రమంలో హైదరాబాద్ రాజీవ్ రహదారిపై దుద్దెడ టోల్ గేట్ దగ్గరకు రాగానే అతడు దొంగిలించిన అంబులెన్స్ కు యాక్సిడెంట్ అయింది‌. దీనితో ఎక్కడ నుంచి బయలుదేరాడో మళ్లీ అక్కడికి పేషెంట్ లాగా వచ్చి జాయిన్ అయ్యాడు ఆ దొంగ..

ఆ యువకుడి పేరు వల్లెపు అశోక్ అని.. పోలీసులు తెలిపారు. అంబులెన్స్ తీసుకొని తన అక్క దగ్గరికి పోతున్నానని.. ఇంతలో యాక్సిడెంట్ అయినట్లు తమకు సమాధానం చెప్పాడని పోలీసులు తెలిపారు. అశోక్ ది మద్దూర్ మండల రేపర్తి గ్రామంగా పోలీసులు గుర్తించారు. అతని తండ్రి పేరు పోశెట్టిగా పేర్కొన్నారు.

ఏది ఏమైనా అంబులెన్స్ ను ఏ ఆసుపత్రి నుంచి దొంగలించాడో మళ్ళీ అదే ఆసుపత్రికి పేషెంట్ గా రావడంతో ఆసుపత్రి సిబ్బంది, పోలీసులే కాదు.. ఆ దొంగ కూడా ఆశ్చర్యానికి గురైయ్యాడు. ఈఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అంబులెన్స్‌లో అక్క దగ్గరికి వెళ్తున్నానని చెప్పాడు.. చివరకు..
అంబులెన్స్‌లో అక్క దగ్గరికి వెళ్తున్నానని చెప్పాడు.. చివరకు..
పాలల్లోనా.. రెండ్‌ మీట్‌లోనా? కాల్షియం, విటమిన్‌ D ఎందులో ఎక్కువ!
పాలల్లోనా.. రెండ్‌ మీట్‌లోనా? కాల్షియం, విటమిన్‌ D ఎందులో ఎక్కువ!
రాకింగ్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..
రాకింగ్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..
కట్టు బట్టలతో బయటకు వెళ్లిపోయిన కళ్యాణ్, అప్పూలు.. కావ్యపై నిందలు
కట్టు బట్టలతో బయటకు వెళ్లిపోయిన కళ్యాణ్, అప్పూలు.. కావ్యపై నిందలు
మిల్క్‌ పౌండర్‌తో మచ్చలేని సౌందర్యం మీ సొంతం.. ఎలా వాడాలంటే!
మిల్క్‌ పౌండర్‌తో మచ్చలేని సౌందర్యం మీ సొంతం.. ఎలా వాడాలంటే!
త్రివర్ణపతాకం చరిత్ర, ప్రాముఖ్యత, ఎగరవేయడంలో పాటించాల్సిన నియమాలు
త్రివర్ణపతాకం చరిత్ర, ప్రాముఖ్యత, ఎగరవేయడంలో పాటించాల్సిన నియమాలు
ఓటీటీలోకి అల్లు శిరీష్ లేటెస్ట్ మూవీ..
ఓటీటీలోకి అల్లు శిరీష్ లేటెస్ట్ మూవీ..
5వ అంతస్తు నుంచి రోడ్డుపై పడిన కుక్క..మూడేళ్ల బాలికపై పడటంతో మృతి
5వ అంతస్తు నుంచి రోడ్డుపై పడిన కుక్క..మూడేళ్ల బాలికపై పడటంతో మృతి
కౌన్సిలర్ కాదు.. నీచుడు.. బాలికను కారు ఎక్కించుకొని..
కౌన్సిలర్ కాదు.. నీచుడు.. బాలికను కారు ఎక్కించుకొని..
వీళ్లది అట్లాంటి.. ఇట్లాంటి యాపారం కాదు.. అసలు విషయం తెలిస్తే
వీళ్లది అట్లాంటి.. ఇట్లాంటి యాపారం కాదు.. అసలు విషయం తెలిస్తే