Telangana: గుట్టలు, వాగులు దాటుతూ.. 22 కి.మీ కాలినడకన నడిసొచ్చిన ఓటు వేసిన గిరిజనులు

ఇళ్లలో నుండి బయటకు రాని ఓటర్లు.. ఓటు విలువ గుర్తించని వారికి ఈ గిరిజనులే స్ఫూర్తి.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 22 కి.మీ నడిచారు. మండు టెండలో కొండలు దాటుకుంటూ, వాగులు దాటి వచ్చి ఓటు హక్కు వినియోగం చేసుకున్నారు. మైళ్ళ దూరం కాలినడకన వచ్చి ఓటుహక్కు సద్వినియోగం చేసుకున్న వారిని అధికారులు, రాజకీయ నేతలు అభినందించారు..

Telangana: గుట్టలు, వాగులు దాటుతూ.. 22 కి.మీ కాలినడకన నడిసొచ్చిన ఓటు వేసిన గిరిజనులు
Tribal Voters
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: May 13, 2024 | 5:43 PM

ఇళ్లలో నుండి బయటకు రాని ఓటర్లు.. ఓటు విలువ గుర్తించని వారికి ఈ గిరిజనులే స్ఫూర్తి.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 22 కి.మీ నడిచారు. మండు టెండలో కొండలు దాటుకుంటూ, వాగులు దాటి వచ్చి ఓటు హక్కు వినియోగం చేసుకున్నారు. మైళ్ళ దూరం కాలినడకన వచ్చి ఓటుహక్కు సద్వినియోగం చేసుకున్న వారిని అధికారులు, రాజకీయ నేతలు అభినందించారు..

ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు వేయండి.. మీకు నచ్చిన నాయకుణ్ణి ఎన్నుకొండని ఎన్నికల కమిషన్, మీడియా, స్వచ్ఛంద సంస్థలు ఎంత మొత్తుకున్నా బాధ్యత కలిగిన కొందరు పౌరులు నిర్లక్ష్యాన్ని విడడం లేదు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో తక్కువ పోలింగ్ పర్సంటేజ్ నమోదు అవుతుంది.

ఓటు విలువ గుర్తెరుగని వారికి ఈ గిరిపుత్రులే స్ఫూర్తి. ఏకంగా 22 కి.లో మీటర్ల దూరం నడుచుకుంటూ వచ్చి ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారు.. అది కూడా గుట్టలు పుట్టలు, వాగులు దాటుకుంటూ వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ గిరిపుత్రులు ములుగు జిల్లా వాజేడు మండలం పేనుగోలు గ్రామంలోనికి చెందినవారు. చెత్తిస్ గడ్, తెలంగాణ సరిహద్దులో పూర్తిగా కారదవిలో ఉండే ఈ గ్రామం లో 11 మంది ఓటర్లు ఉన్నారు. వారు ఓటు వేయాలంటే 22 కి.మీ దూరంలోని వాజేడు వరకు రావాలి.

పోలింగ్ కేంద్రానికి చేరుకోవడం వీరికి పెద్ద సవాలే..! పూర్తిగా నడక దారిలోనే రావాలి. మార్గ మధ్యలో రెండు గుట్టలు, వాగలు దాటుకుంటూ రావాలి. మండు టెండలోనూ గుట్టలు పుట్టలు దాటుకుంటూ వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. 22 కిలోమీటర్లు నడిచి వచ్చి ఓటు వేసి ఓటు విలువను చాటి చెప్పారు. కనీసం రవాణా సదుపాయాలు లేక మిగతా వారు రాలేకపోయారని, వచ్చే పాలకులైనా తమ గ్రామానికి రవాణా సదుపాయాలు, విద్యా, వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు. మండల కేంద్రానికి రావాలంటే ఎన్నో కష్టాలు పడాలని, వైద్య కోసం వచ్చిన వారు మధ్యలోనే మరణించారని, మా గ్రామానికి ప్రభుత్వ సహాయ సహకారాలు అందించాలని గ్రామస్తులు కోరారు.

ఓటు వేయడానికి బద్దకిస్తు పొలింగ్ కేంద్రాల వద్దకు రాని నేటి తరం ఓటర్లకు ఓటు విలువను చాటి చెబుతున్నారు. మైళ్ళ దూరం నడుచుకుంటూ వచ్చి ఓటు వేసిన పెనుగోలు గిరిజనులను అధికారులు, స్థానిక నాయకులు అభినందించారు.

వీడియో చూడండి… 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
కోల్‌కతాదే ఐపీఎల్-17 కప్.. ఫైనల్‌లో హైదరాబాద్ చిత్తు..
కోల్‌కతాదే ఐపీఎల్-17 కప్.. ఫైనల్‌లో హైదరాబాద్ చిత్తు..
రోహిత్‌ రికార్డును మడతపెట్టేశాడు.. కింగ్ కోహ్లీ వెంట పడుతున్నాడు
రోహిత్‌ రికార్డును మడతపెట్టేశాడు.. కింగ్ కోహ్లీ వెంట పడుతున్నాడు
ఇనిస్టెంట్ నూడిల్స్ కొంటున్నారా.. పురుగులు, బ్యాక్టీరియా ఫ్రీ
ఇనిస్టెంట్ నూడిల్స్ కొంటున్నారా.. పురుగులు, బ్యాక్టీరియా ఫ్రీ
కేజీ చేపలు కేవలం రూ.10కే.. మంచి తరుణం మించిన దొరకదు
కేజీ చేపలు కేవలం రూ.10కే.. మంచి తరుణం మించిన దొరకదు
కూల్ వెదర్.. జూ పార్క్‎ను అలాంటి స్పాట్‎ల కోసం ఎంచుకుంటున్న యువత
కూల్ వెదర్.. జూ పార్క్‎ను అలాంటి స్పాట్‎ల కోసం ఎంచుకుంటున్న యువత
చెలరేగిన KKR బౌలర్లు.. కుప్పకూలిన SRH.. టార్గెట్ ఎంతంటే?
చెలరేగిన KKR బౌలర్లు.. కుప్పకూలిన SRH.. టార్గెట్ ఎంతంటే?
మీరు మొబైల్‌ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి..
మీరు మొబైల్‌ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి..
తొలుత 2 వేలు పెడితే అదిరే లాభం.. అందుకే 69 లక్షలు పెట్టాడు.. కానీ
తొలుత 2 వేలు పెడితే అదిరే లాభం.. అందుకే 69 లక్షలు పెట్టాడు.. కానీ
లండన్ వీధుల్లో.. లుంగీతో హల్‌చల్‌ చేసిన యువతి.. జనాల రియాక్షన్‌
లండన్ వీధుల్లో.. లుంగీతో హల్‌చల్‌ చేసిన యువతి.. జనాల రియాక్షన్‌
ఇలాంటి పిల్లిని మీరు చూశారా.? నిన్న శ్రీశైలంలో, నేడు హార్స్‌లీలో
ఇలాంటి పిల్లిని మీరు చూశారా.? నిన్న శ్రీశైలంలో, నేడు హార్స్‌లీలో