ప్రమాదవశాత్తూ గ్యాస్ సిలిండర్ పేలడంతో.. 10 లక్షల రూపాయాలు దగ్ఢమైయ్యాయి. కరెన్సీ కాలిపోయిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రి గ్రామంలో జరిగింది. కప్పల లక్ష్మయ్య అనే రైతు తన తండ్రికి చెందిన ఉమ్మడి భూమిని విక్రయించగా 10 లక్షల రూపాయలు వచ్చాయి. ఈ క్రమంలో 10 లక్షల నగదును బీరువాలో దాచిపెట్టాడు. అవసరాలకు పనికి వస్తుందని లెక్కలు వేసుకున్నాడు. గ్రామంలోనే మరో చోట కొంత భూమి కొనుగోలు చేసి ఇల్లు కట్టుకుందామనుకున్నాడు. దానికి సంబంధించి స్థలం, సామగ్రి, మేస్త్రీ ఇతర పనులన్ని దాదాపుగా పూర్తయ్యాయి. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు దాటికి లక్ష్మయ్య పూరి గుడిసె మంటల్లో కాలిపోయింది. చుట్టుపక్కల వారు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా.. లాభం లేకపోయింది. ఈ పూరి గూడెసెలోనే ఉన్న బీరువాలోని 10 లక్షలు కూడా కాలి బూడిదయ్యాయి.
కొన్ని నోట్లు పూర్తిగా కాలిపోగా.., ఇంకొన్ని నోట్లు పాక్షికంగా కాలిపోయాయి. వాటితోపాటే ఆ రైతు సొంతింటి కల కూడా బూడిదైపోయింది. దీంతో లక్ష్మయ్య కుటుంబం కన్నీటి వేదన వర్ణనాతీతంగా మారింది. లక్ష్మయ్య కుటుంబ సభ్యులను ఓదార్చలేకపోతున్నారు స్థానికులు. మంటల్లో నగదుతోపాటు వ్యవసాయ పాస్బుక్లు, ఎల్ఐసీ పత్రాలు, ఇతర సామగ్రి కూడా కాలిపోయింది. ఇక తన జీవితంలో సొంత ఇల్లు కట్టుకోలేనేమోనని కన్నీరుపెట్టుకున్నాడు ఆ పేద రైతు. ఇలా దాచుకున్న సొమ్ము అగ్నికి ఆహుతి కావడంతో.. తనను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నాడు లక్ష్మయ్య.
Also Read: ‘మా’లో బిగ్ ట్విస్ట్.. ఎన్నికల కేంద్రంలో రౌడీషీట్ ఉన్న వ్యక్తి గుర్తింపు..
Telangana: ‘అయ్యో పాపం’ అని లిఫ్ట్ ఇస్తే.. చుక్కలు చూపించారు