Power Bill: సెకన్లలోనే కరెంట్ బిల్లు మీ చేతికి.. మొబైల్ నుంచే అత్యంత వేగంగా ప్రాసెస్.. సూపర్ స్మార్ట్ కదా..

కరెంట్ బిల్లు జారీలో మరింత వేగం పెరిగింది. ఇప్పటివరకు స్పాట్ యంత్రాల ద్వారా బిల్లు అందించేవారు. కానీ ఇక నుంచి స్మార్ట్‌ఫోన్ ద్వారానే కరెంట్ బిల్లు జరీ చేయవచ్చు. సెకన్లలోనే సింపుల్‌గా పని పూర్తవుతుంది. విద్యుత్ శాఖ సిబ్బందికి కూడా శ్రమ తప్పుతుంది.

Power Bill: సెకన్లలోనే కరెంట్ బిల్లు మీ చేతికి.. మొబైల్ నుంచే అత్యంత వేగంగా ప్రాసెస్.. సూపర్ స్మార్ట్ కదా..
Free Power

Updated on: Apr 08, 2026 | 10:21 AM

ఇప్పటివరకు మీటర్ రీడింగ్ చెక్ చేసి కరెంట్ బిల్లు ఇవ్వాలంటే సిబ్బంది స్పాట్ బిల్లింగ్ యంత్రాలు ఉపయోగించేవారు. మీటర్ దగ్గర వాటిని ఉంచగానే అవి రీడింగ్ నమోదు చేసి బిల్లును జనరేట్ చేసేవి. ఈ మెషిన్లలో ప్రింటర్ ఉండటం వల్ల బరువు ఎక్కువగా ఉంటుంది. బిల్లు రావడానికి కాస్త ఎక్కువ టైమ్ పట్టడం వల్ల ప్రతీ మీటర్ వద్ద ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తుంది. ఒక మీటర్ వద్ద ప్రింట్ తీశాకనే మరో మీటర్ వద్ద రీడింగ్ తీసుకోవడానికి కుదురుతుంది. అయితే కొత్తగా వచ్చిన కరెంట్ బిల్లు జారీ సిస్టమ్‌లో అత్యంత వేగంగా కరెంట్ బిల్లు జారీ కానుంది. ఈ కొత్త సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది..? అనే విషయాలు చూద్దాం.

స్మార్ట్ ఫోన్ ద్వారానే ప్రాసెస్

ఇక నుంచి స్మార్ట్ ఫోన్ ద్వారానే కరెంట్ బిల్లు జారీ చేయచ్చు. తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ కొత్త టెక్నాలజీతో సులువుగా వినియోగదారులకు బిల్లులు అందిస్తోంది. స్మార్ట్‌ఫోన్‌కు ఒక డాంగిల్ అమర్చుతారు. దీనిని మీటర్ వద్ద పెట్టగానే రీడింగ్‌ను ఆటోమేటిక్‌గా స్కాన్ చేసి బిల్లు జనరేట్ చేస్తుంది. ఇక జేబులో పట్టేంత సైజులో ఉండే మినీ ప్రింటర్‌ను బ్లూటూత్‌తో కనెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బ్లూటూత్ కనెక్ట్ చేయడం ద్వారా బిల్లు ప్రింట్ వచ్చేస్తుంది. అంతేకాకుండా ఒకేసారి అన్ని రీడింగ్‌లను తీసుకోవచ్చు. దీని వల్ల కరెంట్ బిల్లు త్వరగా నిమిషాల్లోనే జారీ చేయవచ్చు. ఇటీవల ఈ టెక్నాలజీని విద్యుత్ సంస్థలు ఉపయోగిస్తున్నాయి. ఈ విధానం వల్ల కరెంట్ బిల్లు వేగంగా సిబ్బంది జారీ చేస్తున్నారు. మీటర్ వద్ద వేచి ఉండే సమయం తగ్గుతుంది. సిబ్బందికి సమయం కూడా ఆదా అవుతుంది.

కరెంట్ బిల్లు చెల్లించడం ఎలా..?

ఇక కరెంట్ బిల్లులు చెల్లించేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. మీ సేవకు వెళ్లి చెల్లించవచ్చు. ఇక యూపీఐ యాప్స్ ద్వారా కూడా సెకన్లలోనే చెల్లించే సౌకర్యం అందుబాటులో ఉంది. ఇక బ్యాంకింగ్స్ యాప్స్, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా విద్యుత్ బిల్లులు కట్టవచ్చు. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి యాప్స్‌లో కూడా చెల్లించవచ్చు. ఒకసారి మీరు వీటిల్లో బిల్లు కడితే నెక్ట్స్ బిల్లు రాగానే మీకు ఆటోమేటిక్‌గా నోటిఫికేషన్ రూపంలో తెలిసిపోతుంది. దీంతో కరెంట్ బిల్లు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక విద్యుత్ పంపిణీ సంస్థ వెబ్ సైట్లలోకి వెళ్లి కూడా బిల్లు చెల్లించవచ్చు.

Follow Us